తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లపై మరోసారి కోర్టు స్టే విధించింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు అమలు చేయడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గతంలో ఆధార్ వివరాలు సేకరించబోమని తెలిపిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ వివరాలను కూడా సేకరిస్తుందని వెల్లడించారు.
కాగా ఈ అంశంపై హై కోర్టు తెలంగాణ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తంచేసింది. విచారణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరిస్తుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కోర్టుకు ఒకటి చెప్పి బయట మరోలా వ్యవహరిస్తుండటం పట్ల మండిపడింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే ను గురువారం వరకు పొడిగించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.