logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!

పాత సెక్రటేరియట్ స్థానంలో కొత్త సెక్రటేరియట్ కట్టడం కోసం పాత భననాలను ప్రభుత్వం గత మూడు రోజులుగా కూల్చివేస్తుంది. తాజాగా కేసీఆర్ ప్రభుత్వానికి హై కోర్టు షాకిచ్చింది. ఇప్పటికే మొదలైన సచివాలయం కూల్చివేతను నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేత పనులు నిలిపివేయాలంటూ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు అనే వ్యక్తి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు.

దీనిపై విచారణ చేపట్టిన హై కోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. భవనాల కూల్చివేయడం వలన వాతావరణ కాలుష్యం అవుతుందని పిటీషనర్ తన పిల్ లో తెలిపాడు. కోవిద్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా.. వేస్ట్ మేనేజిమెంట్ నిబంధనలను పాటించకుండా భవనాల కూల్చివేతను చేపడుతున్నారని కోర్టుకు వెల్లడించాడు. ఈ పిల్ ను విచారణకు స్వీకరించిన హై కోర్టు సచివాలయ కూల్చివేత పనులకు తాత్కాలిక బ్రేక్ ప్రకటించింది.

Related News