logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

హైద‌రాబాద్ వ‌ర‌ద‌లు.. భారీగా విరాళాలు ప్ర‌క‌టించిన హీరోలు

వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌లం అవుతున్న హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు దాత‌లు ముందుకొస్తున్నారు. వ‌ర‌ద‌ల కార‌ణంగా న‌గ‌రం తీవ్రంగా న‌ష్ట‌పోయినందున ఆదుకోవ‌డానికి ముందుకు రావాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆయ‌న పిలుపునకు అన్ని వ‌ర్గాల వారి నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఢిల్లీ ప్ర‌భుత్వం ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ రూ.15 కోట్లు విరాళం ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్ సోద‌రీసోద‌రుల‌కు తాము అండ‌గా ఉంటామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

తెలంగాణ‌కు చేసిన సాయానికి గానూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అర‌వింద్ కేజ్రీవాల్‌కు ఫోన్ చేసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కూడా తెలంగాణ‌కు రూ.10 కోట్ల సాయాన్ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి ప్ర‌క‌ట‌న చేశారు. ప‌ళ‌నిస్వామికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ లేఖ రాసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం స్పీడ్ బోట్లు కావాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి కోర‌గా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వెంట‌నే అంగీక‌రించి హైద‌రాబాద్‌కు స్పీడ్ బోట్ల‌ను పంపించారు.

వ్యాపార సంస్థ‌లు కూడా కేసీఆర్ పిలుపుకు స్పందిస్తున్నాయి. మేఘా ఇంజ‌నీరింగ్ సంస్థ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 కోట్లు విరాళం అందించింది. సినీ ప్ర‌ముఖులు కూడా పెద్ద మ‌న‌స్సుతో హైదాబాద్‌ను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయ‌ల విరాళం ప్ర‌క‌టించారు. మ‌హేష్ బాబు కూడా సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయ‌ల విరాళం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేశారు.

వ‌ర‌ద‌ల‌ను ఎదుర్కోవ‌డంలో తెలంగాణ ప్ర‌భుత్వం కృషిని మ‌హేష్ బాబు ప్ర‌శంసించారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ సైతం హైద‌రాబాద్‌కు అండ‌గా నిలిచారు. ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి ఆయ‌న రూ.50 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. హీరో నాగార్జున సైతం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 ల‌క్ష‌ల విరాళం అందిస్తున్న‌ట్లు తెలిపారు. విప‌త్తులు సంభ‌వించిన వేళ త‌న వంతు సాయం చేయ‌డంలో ఎప్పుడూ ముందుండే విజ‌య్ దేవ‌ర‌కొండ రూ.10 ల‌క్ష‌లు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు.

మ‌రో యంగ్ హీరో రామ్ పోతినేని తెలంగాణ ప్ర‌భుత్వానికి రూ.25 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. వ‌ర‌ద‌ల మొద‌టిరోజు నుంచి కేటీఆర్ క్షేత్ర‌స్థాయిలో ఉండి ప్ర‌జ‌ల‌ను ఆదుకుంటున్నార‌ని తెలిపిన రామ్ కేటీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ త‌న‌వంతుగా రూ.5 ల‌క్ష‌లు, మ‌రో డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి రూ.5 ల‌క్ష‌లు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇచ్చారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రెండు నెల‌ల జీతాల‌ను విరాళంగా ప్ర‌క‌టించారు. విరాళాలు ప్ర‌క‌టించిన అంద‌రికీ మంత్రి కేటీఆర్ కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

Related News