logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఆర్థిక ఇబ్బందుల్లో హీరోయిన్ రాశి..?

లేట్ నైంటీస్ లో తెలుగు తెర పై మెరిసి అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రాశి. చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఆ తరువాత తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. తెలుగులో రాశి హీరోయిన్ గా తొలిసారి నటించిన సినిమా శుభాకాంక్షలు. గోకులంలో సీత, ప్రేయసి రావే సినిమాలు ఆమెకు మంచి గుర్తింపునిచ్చాయి.

ఆ తరువాత కుర్ర హీరోయిన్ల ఎంట్రీతో ఆమె తన హవా కొనసాగించలేకపోయారు. పెళ్లి చేసుకుని కొంత కాలం సినీ పరిశ్రమకు దూరమయ్యారు రాశి. ఆ తరువాత కూడా ‘నిజం’ సినిమాలో బోల్డ్ కారెక్టర్ లో నటించి షాకిచ్చారు. అయితే ఈ అందాల నటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆ విషయం తెలిసి ఆమే అభిమానులు కొందరు ఆమెను సంప్రదించారట.

తాజాగా ఈ విషయం పై రాశి తన సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్పందించారు. తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని తన కుటుంబంతో సంతోషంగా ఉన్నానని చెబుతూనే మరోవైపు కష్టాలనేవి మనిషి జీవితంలో సర్వసాధారణం అన్నిటిని దాటుకుంటూ వెళ్లాలని తెలిపారు. ప్రస్తుతం ఆమె తన యూట్యూబ్ ఛానెల్ ‘రాశి విజన్స్’ ద్వారా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. వంటలు, లైఫ్ స్టైల్ వీడియోలు పోస్ట్ చేస్తూ సందడి చేస్తున్నారు.

Related News