టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘గీత గోవిందం’ ఫెమ్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఇటీవల ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను సినిమా యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో మహేష్ కు జోడిగా ఎవరు నటిస్తారనే విషయంపై క్లారిటీ లేదు.
గతంలో ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ సరసన నటించిన కియారా అద్వానీని ఈ పాత్ర కోసం సంప్రదించినట్టు తెలుస్తుంది. కానీ ఆమె బాలీవుడ్ లో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక నో చెప్పిందట. తాజగా ఈ సినిమాలో హీరొయిన్ ను ఫిక్స్ చేసారు. ‘మహానటి’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్ మహేష్ కు జోడీగా నటిస్తున్నట్టు సమాచారం.
కీర్తికి సినిమా కథ బాగా నచ్చడంతో ఆమె ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలోనే అందుకు సంబందించిన అఫీషియల్ సమాచారాన్ని చిత్ర బృందం విడుదల చేయనున్నారు. కాగా లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగులు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెల నుంచి ‘సర్కారు వారి పాట’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.