logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ

హీరోగా చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా మంచి న‌టుడిగా, కామెడీ పండించే యాక్ట‌ర్‌గా తెలుగు ప్ర‌జ‌ల‌కు బాగా ప‌రిచ‌యం అయ్యాడు వేణు తొట్టెంపూడి. 1999లో స్వ‌యంవ‌రం సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన వేణు ఆ త‌ర్వాత దాదాపుగా 22 సినిమాల్లో న‌టించాడు. ఎనిమిదేళ్ల పాటు ఇండ‌స్ట్రీకి, న‌ట‌న‌కు దూరంగా ఉన్న వేణు ఇప్పుడు మ‌ళ్లీ మ‌న ముందుకు రానున్నాడు.

చిరు న‌వ్వుతో, హ‌నుమాన్ జంక్ష‌న్‌, పెళ్లాం ఊరెళితే, స‌దా మీసేవ‌లో, చెప్ప‌వే చిరుగాలి, ఖుషిఖుషీగా వంటి సినిమాల‌తో తెలుగు ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రైన వేణు కొన్ని రోజుల త‌ర్వాత హీరోగా కాకుండా ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌డం కూడా ప్రారంభించారు. 2013లో రామ్ చ‌ర‌ణ్ హీరోగా వ‌చ్చిన ద‌మ్ము సినిమాలో వేణు ఒక కీ రోల్‌లో క‌నిపించాడు. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో గానీ చాలా రోజులుగా సినిమాల్లో న‌టించ‌డం లేదు.

ఇప్పుడు మ‌ళ్లీ వేణు వెండితెర‌పై క‌నిపించ‌నున్నాడు. రవితేజ, శరత్‌ మండవ కాంబినేషన్‌లో ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ అనే ఒక సినిమా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌లైంది. సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ బాగా ఆక‌ట్టుకుంటోంది. గ‌తంలో ఏ హీరో చేయ‌ని పాత్ర‌లో ర‌వితేజ ఒక త‌హ‌శీల్దార్‌గా ఈ సినిమాలో క‌నిపిస్తాడ‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కూడా ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని తెలుస్తోంది. వేణు క్యారెక్ట‌ర్‌కు సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంద‌ట‌. అందుకే ఎనిమిదేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంటున్నా కూడా ఈ క‌థ‌, క్యారెక్ట‌ర్ గురించి చెప్ప‌గానే వేణు ఓకే చెప్పాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ వేగంగా జ‌రుపుకుంటున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Related News
%d bloggers like this: