మెగా ఫ్యామిలిలో కరోనా కలకలం రేగుతుంది. ఇప్పటికే హీరో రామ్ చరణ్ కు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో మెగా హీరో వరుణ్ తేజ్ కు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్నీ వరుణ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా పరీక్షలు చేయించుకోగా తనకు పాజిటివ్ గా తేలిందని అన్నారు.
అయితే తానిప్పుడు హోమ్ క్వారెంటైన్ లో ఉండి మందులు వాడుతున్నానని తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు జరిపించుకోవాని ఆయన కోరారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితం మెగా ఫ్యామిలిలో జరిగిన క్రిస్టమస్ వేడుకలకు కుటుంబమంతా హాజరయ్యారు.
ఈ పార్టీలో రామ్ చరణ్ కూడా పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజు రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇప్పుడు మిగిలిన కుటుంబ సభ్యుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కాగా రామ్ చరణ్ కొని రోజులుగా ఆచార్య షూటింగ్ లో పాల్గొంటున్నాడు. దీంతో ‘ఆచార్య’ సినిమా టీమ్ లో కూడా కరోనా భయం నెలకొంది.