logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

రోజా అన్నయ్య అంటుంటే నచ్చేది కాదు.. హీరో శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్!

1999లో శ్రీకాంత్- రాశి హీరోహీరోయిన్లుగా చంద్ర మహేష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ప్రేయసి రావే’. డి. రామానాయుడు ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమాతోనే చంద్ర మహేష్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఎంఎం శ్రీలేఖ సంగీతం, పోసాని డైలాగ్స్, శ్రీకాంత్ రాశిలా నటనా కలిసి ఈ సినిమాను సూపర్ హిట్ గా నిలిపాయి.

ప్రేయసి రావే సినిమా 21 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా హీరో శ్రీకాంత్ ఓ ఇంటర్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో రాశి నేను కలిసి నటించాము. రామానాయుడు గారు నాతో పట్టుబట్టి ఈ సినిమా చేయించారు. ఈ సినిమా క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది. ఇక అప్పట్లో రాశి, రమ్యకృష్ణ, రోజా వీళ్లంతా టాప్ హీరోయిన్లుగా ఉన్నారు.

వీళ్లందరితో చాలా సినిమాల్లో నటించాను. మేమంతా స్నేహితుల్లా ఉండేవాళ్ళం. కుటుంబంలా కలిసి పోయి వరుసలతో పిలుచుకునే వాళ్ళం. ఆ రోజులు ఎంతో సంతోషాన్నిస్తాయని ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు శ్రీకాంత్. అయితే ఈ సందర్భంగా సీనియర్ హీరోయిన్, ఎమ్మెల్యే రోజా గురించి శ్రీకాంత్ కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు.

ఇద్దరం కలిసి ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’, ‘తిరుమల తిరుపతి వెంకటేశ’ లాంటి మూడు సినిమాల్లో నటించాం. రోజా నన్ను అన్నయ్య అని పిలిచేది. ఒక రోజు షూటింగ్ లో ఇద్దరం ఒక రొమాంటిక్ సీన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు రోజా అన్నయ్యా అలా చేద్దాం అన్నయ్యా ఇలా చేద్దాం అంటుంటే ‘ఎహే ఆపు కొంచెం సేపైనా అన్నయ్య అనడం అలా పిలుస్తుంటే నాకు ఫీల్ రావడం లేద’ని అనేవాడిని. మేమిద్దరం మంచి స్నేహితులమంటూ శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.

Related News