logo

  BREAKING NEWS

ఫలించిన ‘శ్వేత రాయబారం’.. మనసు మార్చుకున్న బుద్ధా!  |   హిందూపురంలో సీన్ రిపీట్.. అభిమానికి విశ్వరూపం చూపించిన బాలయ్య!  |   నా అనుచరుడు ఒక్కడు చాలు.. నీ పని ఖతం: టీడీపీలో బుద్ధా వర్సెస్ కేశినేని  |   అవును అప్పులు చేసాం.. ఆ విషయం గర్వంగా చెప్తాం : మంత్రి బుగ్గన  |   షాకింగ్ సర్వే.. హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా!  |   అసెంబ్లీ ఎన్నికల ముందు కేరళ సీఎంకు షాక్.. విజయన్ మెడకు మళ్ళీ అదే కేసు!  |   హై కోర్టుకు ఎన్నికల సంఘం క్షమాపణలు.. ఎందుకంటే?  |   ఇదేనా దోస్తానా..? ఏపీలో అడుగుపెడుతున్న ఎంఐఎం  |   మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |  

139 మంది అత్యాచారం కేసు.. ఆరోపణలపై స్పందించిన కృష్ణుడు.. కీలక వ్యాఖ్యలు!

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ యువతి తనపై 139 మంది అత్యచారం చేశారని పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ కేసులో సినీ నటులు, యాంకర్లు, న్యూస్ రిపోర్టర్లు సహా మరి కొందరు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. దీనిపై నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ కేసులో యాంకర్ ప్రదీప్ కు నోటీసులు జారీ చేయగా తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని అతను ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తున్న మరో పేరు సినీ నటుడు కృష్ణుడు. వినాయకుడు సినిమాతో హీరోగా నటించిన కృష్ణుడి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తనపై వస్తున్న ఆరోపణలపై కృష్ణుడు స్పందించారు. ఈ ఆరోపణలను ఖండించారు. ప్రముఖ వ్యక్తులను టార్గెట్ చేయడం ద్వారా కేసు తీవ్రత పెంచాలనుకోవడం కరెక్ట్ కాదు. ఆమె చదువుకోవడానికి వచ్చి తనకు ఇంత అన్యాయం జరుగుతుంటే అప్పుడే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు.

కనీసం షీ టీమ్స్ ను కూడా ఆమె ఎందుకు ఆశ్రయించలేదు? అని అయన ప్రశ్నించారు. 100 కు ఫోన్ చేసి చెప్పినా పోలీసులు స్పందించి ఉండేవాళ్ళు కదా అన్నారు. ఒక వ్యక్తి తనను కృష్ణుడి దగ్గరకు తీసుకెళ్లాడు అని బాధితురాలు చెప్తుండగా ఆ విషయం విని నేను షాక్ కు గురయ్యానన్నారు. తాను డిప్రెషన్ లోకి వెళ్లానని తన భార్య మాత్రం తనను నమ్మిందని అన్నారు. 20 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాను. ఎంతో మంది మహిళలతో పనిచేసాను. ఇప్పటివరకు తనపై చిన్న రిమార్కు కూడా లేదన్నారు.

ఇలాంటివి తనను తన కుటుంబ సభ్యులను మానసికంగా ఎంతో ఆందోళనకు గురి చేస్తుందన్నారు. అయితే నాలుగు నెలల క్రితం తనకు నల్గొండ నుంచి ఓ యువతీ ఫోన్ చేసిందని చెప్పారు. నాకు మీరంటే చాలా ఇష్టం నల్గొండకు రావాలని కోరిందన్నారు. ఆమె మాట తీరుపై అనుమానం వచ్చి వెంటనే ఆమె నంబర్ ను బ్లాక్ చేసానని తెలిపారు. తనకు కూడా భార్య కూతురు ఉన్నారని మరో మహిళకు అన్యాయం చేయనని అన్నారు. తనకు ఇప్పటి వరకు పోలీసుల నుంచి ఎలాంటి నోటీలుసు అందలేదని ఈ కేసులో పూర్తిగా సహకరిస్తానని అన్నారు.

Related News