logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

కరోనా వాక్సిన్ పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

కరోనా పై పోరాటానికి ప్రపంచమంతా వాక్సిన్ కోసం ఎదురుచూస్తుడ్ని. ప్రపంచ దేశాల్లో ఇప్పటికే కరోనాను కట్టడి చేసే వాక్సిన్ లు దశల్లో ఉన్నాయి. ఇప్పటికే రష్యా వాక్సిన్ భారత్ కు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో వాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనాను అదుపు చేయగలమన్న ఆశలు చిగురిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కరోనా వాక్సిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. కరోనాకు వాక్సిన్ రాలేదు. ఇప్పట్లో రాలేదు కూడా. కరోనాకు వాక్సిన్ ఉందని ఎవరైనా చెప్తే ఆ మాటలు నమ్మకండి. కార్తీక మాసంలో చన్నీటి స్నానం చేస్తుంటాం. కానీ న్యుమోనియా కలుగజేసే కరోనా చాలా ప్రమాదకరం.

అదొక లిపిడ్ ప్రోటీన్. అది ఎప్పటికీ పరివర్తనం చెందుతుంది. అందుకే ఇప్పటివరకు ఈ వైరస్ కు వాక్సిన్ రాలేదు. ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. వేడి నీటి స్నానం, ఆవిరి పట్టడం ఆరోగ్యానికి మంచిదన్నారు. అలాగే ఉప్పునీటితో నోటిని పుక్కిలించుకోవడం లాంటి ఆరోగ్య సూత్రాలను ప్రజలంతా పాటించాలని అప్పుడే అందరం బాగుంటామన్నారు. ‘సెహరి’ సినిమా ఫస్ట్ లుక్ ను తాజాగా బాలయ్య చేతుల మీదుగా లాంచ్ చేసారు. ఈ సందర్భంగా కరోనా వాక్సిన్ పై బాలయ్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Related News