అసని తుఫాను ప్రభావం తెలంగాణపైన కూడా పడనుంది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు సైతం వీస్తాయని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారి శ్రావణి సూచించారు.