logo

  BREAKING NEWS

అన్న‌మ‌య్య జిల్లా పూర్తి వివ‌రాలు  |   తూర్పు గోదావ‌రి(రాజ‌మ‌హేంద్ర‌వ‌రం) జిల్లా పూర్తి వివ‌రాలు  |   ఎన్‌టీఆర్ కృష్ణా జిల్లా పూర్తి వివ‌రాలు  |   శ్రీబాలాజీ తిరుప‌తి జిల్లా పూర్తి వివ‌రాలు  |   ఎంపీ ప‌ద‌విపై క‌న్నేసిన రాజాసింగ్‌.. అక్క‌డి నుంచి పోటీ  |   షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |  

గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు!

వేసవి కాలంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే ఫలం పుచ్చకాయ. ఈ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంచడంలో పుచ్చకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. కానీ ఈ పండులో ఉండే గింజలతో కూడా అన్నే ప్రయోజనాలు కలుగుతాయి. ఈ విషయం తెలియక పుచ్చకాయను తిని గింజలను పడేస్తుంటాం. ఒకసారి ఈ గింజలలో ఉండే పోషక విలువల గురించి తెలుసుకుంటే వీటిని అస్సలు పడేయరు. అవేంటో చూద్దాం..

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు గుండె పనితీరుకు అంతరాయం కలుగుతుంది. దానినే గుండెపోటుగా పిలుస్తారు. పుచ్చకాయ గింజలలో ఉండే అమైనో యాసిడ్స్ రక్త నాళాలను మూసుకుపోకుండా వెడల్పు చేసి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. తద్వారా గుండె జబ్బులు రాకుండా నిరోధించగలవు. రోగ నిరోధకశక్తిని పెంచడంలో దోహదం చేస్తాయి. ఐరన్ సమస్యతో బాధపడే వారికి పుచ్చపండు గింజలు చాలా ఉపయోగపడతాయి. ఈ గింజలలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. శరీరంలో క్యాలరీలను శక్తిగా మార్చడంలో సహాయపడతాయి. బలహీనంగా ఉన్నవారు వీటిని తింటే శక్తి లభిస్తుంది. అలాగే శరీరంలో కొలస్ట్రాల్ నిల్వలు లేకుండా చేయటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

అందుకే బరువు తగ్గాలనుకునేవారు వీటిని తప్పకుండా తీసుకోవాలి. వీటిలో ఉండే లైకోపీన్ అనే పదార్థం కారణంగా పురుషుల్లో వీర్య సమస్యలు దూరమవుతాయి. వీర్య కణాల ఉత్పత్తని పెంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా వీటిల్లో ఉండే ప్రొటీన్, అమైనో ఆసిడ్లు శరీరంలో రక్తపోటును తగ్గిస్తాయి. ఇందులో లభించే ఎల్ సిట్రులిన్ కండరాలను బలంగా ఉంచుతాయి. కణజాలాన్ని రిపేర్ చేస్తాయి. ఫోలిక్ యాసిడ్ ను సహజంగా అందించే ఈ గింజలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

ఫ్రీ రాడికల్స్ బారినపడకుండా రక్షిస్తుంది. ఈ గింజలను నీటిలో మరిగించి టీ చేసుకుని తాగడం వలన కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతాయి. కండరాల కదలికలను క్రమబద్దీకరిస్తాయి. వీటిని ఎడిమా వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ గింజలతో తయారు చేసిన నూనెను స్కిన్ మాయిశ్చరైజర్ గా వాడతారు. అందువల్ల చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. తలలో ఉండే చుండ్రును కూడా ఈ నూనె వదిలిస్తుంది.

పుచ్చకాయ గింజలను ఎండబెట్టి మొత్తగా పొడి చేసుకోవాలి. రెండు లీటర్ల నీటిలో రెండు టేబుల్ స్పూన్ల పుచ్చ గింజల పొడి వేసి పావుగంటసేపు మరిగించాలి. దీన్ని రెండు రోజులపాటు తాగొచ్చు. తర్వాత ఓ రోజు విరామం ఇచ్చి మళ్లీ రెండు రోజులు తాగాలి. ఇలా చేయడం వల్ల పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.

Related News