logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

యువతలోనే అధికంగా హార్ట్ అటాక్ ముప్పు..!

భారతీయులను బలి తీసుకుంటున్న జబ్బుల్లో హార్ట్ అట్టాక్ ముందు వరసలో ఉంది. ఒకప్పుడు 50 ఏళ్ళు దాటిన వారిలో మాత్రమే హార్ట్ అటాక్ ముప్పు ఎక్కువగా కనిపించేది. కానీ మారుతున్న జీవన విధానం ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా యువత కూడా గుండె జబ్బుల భారిన పడుతున్నారు. గత గతేడాదితో పోలిస్తే 40 ఏళ్ల లోపు వయసువారికి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం 15 శాతం పెరిగింది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే కనీసం పదేండ్లు ముందుగానే గుండె జబ్బులకు గురవుతున్నారు. యువత హార్ట్ అటాక్ ల భారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం…

ఎవరికీ ముప్పు.. ?
హార్ట్ అట్టాక్ ముప్పు యువతలో 25-40 ఏళ్ల మధ్య గల స్త్రీ, పురుషులలో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద పట్టణాల్లో నివసించే యువతలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులు కూడా అధికంగా గుండె జబ్బుల భారిన పడుతున్నట్టుగా అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళలతో పోలిస్తే పురుషులకే ఈ ముప్పు ఎక్కువ. సిగరెట్లు, మందు అలవాట్లు ఉన్నవారికి, హైబీపీ, మధుమేహం వ్యాధులు ఉన్నవారికి కూడా ప్రమాదమే. ఇక కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉంటె వారి ద్వారా కూడా రావచ్చు.

లక్షణాలు..
హార్ట్ అటాక్ రావడానికి ముందు చేతిలో మెల్లగా నొప్పి మొదలవుతుంది. ముఖ్యంగా ఛాతి , మెడ భాగంలో నొప్పి అధికంగా ఉంటుంది. కొద్దీ నిమిషాల పాటు నొప్పి అలాగే కొనసాగుతూ ఉంటె హార్ట్ అటాక్ గా అనుమానించాలి. గుండె పోటు వచ్చే ముందు మీద, చేతులు, దవడ, నడుము, పొట్ట భాగంలో అసౌకర్యంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. చెమటలు పట్టడం, కడుపులో వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కారణాలు..
యువతలో చెడు కొలెస్ట్రాల్ భారిన పడేవారే అధికంగా గుండెపోటుకు గురవుతున్నారు. జంక్ ఫుడ్ తినడం, సరైన వ్యాయామం లేకపోవడం, గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం, మానసిక ఒత్తిడి, నిద్ర లేమి సమస్యలు ఉన్నవారికి గుండె జబ్బులు అధికంగా వస్తాయి. సమస్యని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటుకు దారి తీసే అవకాశం ఉంది.

జాగ్రత్తలు..
పాల పదార్థాలు, రిఫైన్డ్ షుగర్, పిండి పదార్థాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. వాటిని ఆహారంలో తక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలి.
ఫైబర్ అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకొవాలి. సమయానికి భోజనం చేయడం, నిద్ర పోవడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయాలి. కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నట్టుగా తెలిస్తే తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

Related News