logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

హార్ట్ అటాక్ .. మొదటి గంటే కీలకం.. లక్షణాలు ఎలా గుర్తించాలి?

శరీరంలో అతి ముఖ్యమైన భాగం గుండె. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే మరణానికి చేరువయినట్లే. కొందరిలో హార్ట్ అటాక్ కారణంగా మరణాలు సంభవించడం చూస్తున్నాం. ప్రతి 33 సెకన్లకు ఒకరు హార్ట్ ఎటాక్ కారణంగా మన దేశంలో ప్రాణాలు కోల్పోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏటా 20 లక్షల మంది బలైపోతున్నారు. హార్ట్ ఎటాక్ బారిన పడుతున్న వారిలో 4 నుంచి 10 శాతం మంది 45 ఏళ్లలోపు వయసు వారుంటున్నారు.

అయితే గుండెపోటు లో మొదటి గంటె ఎంతో కీలకమంటున్నారు వైద్యులు. హార్ట్ ఎటాక్ అంటే, గుండెకు రక్త నాళాల ద్వారా జరిగే రక్త సరఫరాలో ఏదైనా ఆటంకం కలిగినప్పుడు గుండె నొప్పి వస్తుంది. దీంతో ఆక్సీజన్‌తో కూడిన రక్తం గుండెకు చేరుకోకపోవడంతో హార్ట్ ఎటాక్ వస్తుంది. ఈ దశలో ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. అందుకే గుండెపోటు వచ్చిన మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’ గా పిలుస్తారు. ఈ సమయంలో సరిగ్గా స్పందిస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు. అందుకే ముందుగానే గుండె సమస్యలు ఉన్నవారు, లేని వారు కూడా గుండెపోటు లక్షణాలపై అవగాహన కలిగి ఉండటం మంచిది.

గుండెపోటు సడెన్ గా రావడం వలన చనిపోతున్నారని కొందరు భావిస్తుంటారు. కానీ అంతకు ముందునుంచే శరీరం మనకు అనేక సంకేతాలను చూపిస్తుంది. ఛాతి భాగంలో నొప్పిగా అనిపించడం ఎక్కువ మందిలో కనిపించే మొదటి లక్షణం. అయితే కొందరి చాతిలో నొప్పి వస్తే అసిడిటీ, జీర్ణ సమస్యలుగా భావిస్తుంటారు. ఇలాంటివి అశ్రద్ధ చేయకుండా కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి. ముఖ్యంగా వారి కుటుంబంలో(జన్యు పరంగా) ఎవరికైనా గుండె సమస్యలుంటే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. గుండెలో అసౌకర్యంగా ఉండటం, గుండె కాలుతున్నట్టుగా అనిపించడం, ఎదపై విపరీతమైన బరువు ఉన్న భావన కలగడం వంటి సంకేతాలు చూపుతుంది.

అయితే ఛాతీలో చిన్నపాటి నొప్పి ఉండి, గుండెను అదిమినప్పుడు ఆ నొప్పి ఇంకా ఎక్కువవుతున్నట్టుగా అనిపిస్తే అది గుండె పోటు లక్షణం కాకపోవచ్చు. ఈ లక్షణాలు మహిళలు, పురుషుల్లో వేరువేరుగా ఉండవచ్చు. కొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. దీనినే సైలెంట్ హార్ట్ అటాక్ అంటారు. గుండె కండరాలు ఒత్తిడికి గురవ్వడం వలన మహిళల్లో అలసట కనిపిస్తుంది. దీనిని ఎలక్ట్రోగ్రామ్ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. గొంతు లేదా దవడ నొప్పి అనేవి జలుబు, సైనస్ సమస్యల్లో కనిపించే లక్షణాలు. అయితే, కొన్ని సందర్భాల్లో గుండె నొప్పి సమయంలో చాతీ భాగంలోని అధిక ఒత్తిడి గొంతు, దవడ అసౌకర్యంగా ఉండటానికి కారణమవుతున్నాయని అంటారు. గుండె శరరమంతటికీ రక్తాన్ని సరిగా పంప్ చేయలేని స్థితిలో వివిధ భాగాల్లో వాపు కనిపిస్తుంది.

గుండె రక్తాన్ని వేగంగా పంప్ చేయలేకపోతే రక్తం నరాల్లోకి వెనక్కి వచ్చేస్తుంది. దీంతో వాపు కనిపిస్తుంది. వాపు కనిపించినంత మాత్రాన అది గుండెజబ్బుగానే అనుకోవడానికి లేదు, మూత్రపిండాల వైఫ్యలంలోనూ ఇదే విధంగా ఉంటుంది. చమటలు పట్టడం, గొంతు మీద, దవడల్లో పట్టేసినట్టుగా ఉండటం, మాట్లాడటంలో తడబాటు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే చాతిలో కొద్దిగా నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. గుండెపోటు సమస్య రాకుండా ఉండాలంటే క్రమశిక్షణ పరమైన జీవన విధానం, వ్యాయామం చేయడం, మధ్యపానానికి దూరంగా ఉండడం, సిగరెట్‌, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

 

Related News