ప్రపంచంలో గుండెపోటు కారణంగా అనేక మంది మరణిస్తున్నారు. ఇది ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవ్వరమూ చెప్పలేము. శరీరంలో కొలెస్ట్రాల్ వంటివి పేరుకుపోయినప్పుడు అది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాకేజ్ కు కారణమవుతుంది. అందువల్ల గుండెకు రక్తం అందక గుండెపోటు వస్తుంది. అయితే కొన్ని సార్లు అకస్మాతుగా గుండెపోటు సంభవిస్తుంది. దీనినే స్లీపర్ హార్ట్ అటాక్ అంటారు.
అంటే గుండె పోటుకు సంబందించిన ఏ చిన్న లక్షణం కూడా శరీరం చూపదు. ఇది చాలా ప్రమాదకరం. దీని బారిన పడకండా ఉండాలంటే రెగ్యులర్ గా గుండెకు సంబందించిన పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే సాధారణంగా తమ కుటుంబంలో ఎవరైనా గుండెపోటుతో మరణిస్తే వారికి ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏడాదికి ఒక్కసారైనా గుండె ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలి.
అయితే వైద్య విధానంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో గుండె కు సంబందించిన రిస్కును ముందుగానే చెప్పేసే ఓ కొత్త విధానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఒకే ఒక పరీక్షతో కేవలం ఐదు నిమిషాల్లో మీకు హార్ట్ అటాక్ రిస్కు ఎంత ఉంది? ఉంటె ఎప్పుడు వస్తుంది? అనే విషయాలని కూడా చెప్పేస్తుంది. కాల్షియం స్కోరింగ్ టెస్ట్ అనేది గుండె కు సంబందించిన ముప్పును ముందుగానే పసిగడుతుంది.
ధమనుల్లోని కరోనరీ ఆర్టోరీ అనే భాగంలో కాల్షియం పేరుకుపోవడమే గుండెపోటు ప్రధాన కారణంగా చెప్తారు. ఈ టెస్టుల్లో జీరో స్కోర్ వస్తే వారికి గుండె కు సంబందించిన వ్యాధులు చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉందని అర్థం. ఎక్కువగా స్కోర్ వచ్చిన వారికి రిస్కు ఎక్కువని భావించాలి. 100 ఉంచి 300 మధ్యన స్కోరింగ్ ఉన్నవారికి ఈ రిస్కు మధ్యస్తంగా ఉన్నట్టుగా అర్థం. రేడియేషన్ ఉపయోగించి స్కానింగ్ పద్దతిలో ఈ టెస్టు చేస్తారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఈ టెస్టు గురించి మీ వైద్యులను అడిగి తెలుసుకోవడం మంచిది.