logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

ఒంటరిగా ఉన్నపుడు హార్ట్ అటాక్ కు గురైతే? .. ఇలా చేస్తే ప్రాణాలు దక్కుతాయి!

హఠాత్తుగా వచ్చి ప్రాణాలను హరించుకుపోయేది హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ కు గురైనవారిలో మొదటి గంట చాలా కీలకం. వెంటనే స్పందించి చికిత్స అందిస్తే మరణం నుంచి తప్పించుకోవచ్చు. చాలా మందికి వీటి లక్షణాలు తెలియకపోవడంతో మరణిస్తున్నారు. మరికొందరు ఆసుపత్రి పాలై ఐసీయూలో చికిత్స తీసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. కొంత మంది హఠాత్తుగా మరణిస్తుంటారు. దీనినే సైలెంట్ హార్ట్ అటాక్ అంటారు. అందుకే 30 సంవత్సరాలు దాటిన వారు ప్రతి ఆరు నెలలకొకసారి హెల్త్ చెకప్ తప్పక చేయించుకోవాలి. గుండె జబ్బులపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. అత్యవసర సమయాల్లో ఈ అవగాహనే ప్రాణాలను కాపాడే సంజీవనిగా మారుతుంది.

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల గోడలలో కొవ్వు పేరుకుపోతుంది. అది ఎక్కువైతే.. రక్తనాళాలు సన్నగా మారుతాయి. దీనివల్ల గుండెకు రక్తసరఫరా తగ్గిపోతుంది. రక్తసరఫరా తగ్గడమే కాకుండా.. గుండె కండరాలకు పోషకాలు, ఆక్సిజన్ కూడా అందవు. దీనివల్ల గుండె కండరం చచ్చుబడిపోతుంది. దీన్నే గుండె పోటు లేదా హార్ట్ ఎటాక్ అంటారు.

ఎడమవైపు ఛాతిలో అసౌకర్యంగా ఉండటం, ఎడమ వైపు భుజం, దవడ నొప్పిగా ఉండటం, నొప్పి ఎడమవైపుకు పాకుతూ ఉన్నట్టు అనిపించడం, చెమటలు పట్టడంలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి. ఇవన్నీ హార్ట్ అటాక్ లక్షణాలే. హార్ట్ అటాక్ నుంచి కాపాడుకోవడానికి వెంటనే స్పందించడం ఏకైక మార్గం. ఆలస్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కొన్ని సార్లు ఇలాంటి సమయాల్లో ఎవ్వరూ అందుబాటులో ఉండరు. ఎవరికైనా ఫోన్ చేసి సమాచారం ఇచ్చేంత సమయం ఉండదు. కనీసం లేచి మాత్రలు కూడా తీసుకోలేనంత నొప్పి కలుగుతుంది. అలాంటి విపత్కర సమయాల్లో మనకు మనం చేసుకోగల ప్రథమ చికిత్స ఒకటుంది. మీరు ఆసుపత్రికి చేరేవరకు ఇది మీ ప్రాణాలను నిలిపి ఉంచుతుంది.

గుండె పోటుకు గురవుతున్న లక్షణాలు అనిపించిన వెంటనే బలంగా దగ్గాలి. ఊపిరితిత్తుల నిండా గాలిని పీల్చుకుని ఆపకుండా బలంగా దగ్గే ప్రయత్నం చేయాలి. ఇలా దగ్గడాన్ని వయొలెంట్ కాఫ్ అంటారు. ఇలా చేయడం వలన గుండెకు ఆగిపోయిన రక్త సరఫరాను తిరిగి అందించవచ్చు. ఇలా 5 నిమిషాల పాటు ఈ ప్రమాదాన్ని మీరు వాయిదా వేయగలరు. 5 నిమిషాలే అయినా అవి మీ ప్రాణాలను కాపాడే బంగారు క్షణాలవుతాయి.

ఆ సమయంలో మీరు మీరు మీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించవచ్చు. లేదా అంబులెన్స్ కు ఫోన్ చేసేంతవరకైనా మీకు సమయం లభిస్తుంది. ఇలా గుండె సమస్యలతో బాధపడుతున్నవారు కచ్చితంగా స్పిరిన్ మాత్రలను దగ్గర ఉంచుకోవాలి. ఆస్ప్రిన్ మాత్రను నాలుక కింద ఉంచుకోవాలి. మీరు ఇలా దగ్గుతున్న సమయంలోనే ఆస్ప్రిన్ మాత్రలను సంపాదించి వేసుకోగలిగితే ఆసుపత్రికి వెళ్లేంత వరకు మీ ప్రాణాలను కాపాడుకున్నవారవుతారు.

 

Related News