logo

  BREAKING NEWS

ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |  

ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగుతున్నారా? అయితే లైఫ్ లాంగ్ ఈ సమస్యలు తప్పవు!

గతంలో తోపుడుబళ్లు, తీ స్టాళ్ళ దగ్గర టీ తాగేవారికి స్టీల్ గ్లాసులు, పింగాణీ కప్పులో టీ ఇచ్చేవారు. అయితే వాటి నిర్వహణ భారం కారణంగా ఇప్పుడంతా యూజ్ అండ్ త్రో కప్పులు వాడుతున్నారు. చాయ్ ప్రియులు సైతం ఎవరో తాగిన కప్పుల్లో తాగడం ఇష్టం లేక ప్లాస్టిక్ కప్పుల వైపు మొగ్గు చూపుతున్నారు.

కొందరైతే ప్లాస్టిక్ కప్పుల్లోనే టీ తీసుకెళ్తుంటారు. ఇతర చిరుతిళ్ళు అమ్మే బండ్ల దగ్గర కూడా స్టీలుకు బదులుగా డిస్పోజబుల్ కప్పులు, ప్లేట్లనే వాడటం వారు సౌకర్యంగా భావిస్తున్నారు. కానీ టీ , కాఫీ లాంటి వేడి వేడి పానీయాలను ప్లాస్టిక్, పేపర్ కప్పుల్లో తాగడం ప్రమాదకరమంటున్నారు వైద్యులు.

వాటి తయారీలో ప్రమాదకర రసాయల్ని వాడుతుంటారు. వేడి పానీయాలను అందులో పోసినప్పుడు వాటిలోని కెమికల్స్ కూడా వాటితో కలిసి కడుపులోకి వెళతాయి. అవి నేరుగా మన శరీర కణాలపై దాడి చేసి తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ కారణంగా దీర్ఘకాలిక ఆరోస్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇవి పర్యావరణానికి కూడా పెను ప్రమాదమని పరిశోధకులు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

Related News