logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

చిరంజీవికి షాకిచ్చిన రాష్ట్ర ఆరోగ్య శాఖ.. మళ్ళీ క్వారెంటైన్ లోకి..!

చిరంజీవికి కరోనా పాజిటివ్ ఆ తర్వాత నెగిటివ్ రావడంపై రాష్ట్రఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేసారు. ఇటీవల ‘ఆచార్య’ సినిమా షూటింగ్ సమయంలో కరోనా పరీక్షలు చేయించుకోగా మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటీవ్ గా తేలిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల తరువుత మరోసారి పరీక్షలు చేయించుకోగా తనకు అన్ని పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని, ఫాల్స్ కిట్ కారణంగానే తనకు కరోనా పాజిటివ్ గా చూపిందని క్లారిటీ ఇచ్చారు.

కాగా చిరంజీవి ప్రస్తుతం క్వారెంటైన్ లో లేరు. ఆయన నిన్ననే దర్శకుడు కె విశ్వనాధ్ ను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో డాక్టర్ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. చిరంజీవి క్వారెంటైన్ నిబంధనలు పాటిస్తూ క్వారెంటైన్ లో ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేసారు. అయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఏ కరోనా పరీక్ష కూడా వంద శాతం కచ్చితమైన ఫలితాలను చూపలేదు.

కానీ ఇసిఎంఆర్ నిబంధనల ప్రకారం ఒకసారి కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా తేలితే వారిని పాజిటివ్ గానే పరిగణించాల్సిందే అన్నారు. ఆ తర్వాత నెగిటివ్ వచ్చినా కూడా వారు కచ్చితంగా క్వారెంటైన్ లో ఉండాలన్నారు. అలాగే కరోనా బాధితుల మాదిరిగానే స్వీయ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి మళ్ళీ క్వారెంటైన్ కు వెళ్లాల్సి ఉండనుంది.

Related News