logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

శానిటైజర్లతో కాన్సర్ ముప్పు.. స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ

కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరు హ్యాండ్ శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లతో చేతులను శుభ్రం చేసుకోవాలని, మాస్కులను ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శానిటైజర్ల వినియోగం భారీగా పెరిగిపోయింది. అదే స్థాయిలో వీటికి సంబందించిన రకరకాల పుకార్లు కూడా వైరల్ అవుతున్నాయి. కొన్ని నకిలీ వార్తలు ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయి.

తాజాగా శానిటైజర్లకు సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిరంతరాయంగా 50 నుంచి 60 రోజుల పాటు హ్యాండ్ శానిటైర్లు వాడితే ప్రమాదకరమైన కాన్సర్లతో పాటుగా వివిధ చర్మ రోగాలు తలెత్తే అవకాశం ఉందని ఈ వార్త సారాంశం. అయితే ఈ వార్తను ఓ ప్రముఖ పత్రిక ప్రచురించడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు.

తాజాగా ఈ వార్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. కరోనా వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరు 70 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఆల్కహాల్ కలిగిఉన్న శానిటైర్లను వాడాలని సూచించింది. అంతే కాదు శానిటైజర్లతో చర్మ రోగాలు, కాన్సర్ ముప్పు పొంచి ఉందన్న వార్తలను ఖండించింది. ఈ విషయాన్నిసోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

Related News