logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

పటిక (మిశ్రి) గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

క‌ల‌కండ‌, నౌవోతు, మిశ్రి, కండ చ‌క్కెర ఇలా అనేక పేర్లతో పటికను పిలుస్తారు. చక్కెరను శుద్ధి చేస్తే వచ్చే పదార్థమే పటిక. రుచికి తీయగా ఉండే ఈ పదార్థం పెద్ద పెద్ద స్పటికాలుగా ఉంటుంది. కానీ చక్కర కన్నా ఇందులో తీపి శాతం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. పటిక బెల్లంలో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు మరియు అమినో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.కేవలం మాంసాహారంలో మాత్రమే దొరికే ముఖ్యమైన విటమిన్, విటమిన్ బి12 మిశ్రిలో ఎక్కువ మొత్తంలో దొరుకుతుంది. పటిక శరీరానికి ఎంతో చలువ చేస్తుంది, జీర్ణశక్తిని పెంచి శారీరక బలాన్ని, వీర్యపుష్టిని ఇస్తుంది. వాత, పిత్త , కఫ దోషాల వ‌ల్ల క‌లిగే అనేక రోగాల‌కు ఔషధంగా పనిచేస్తుంది. అయితే తియ్యగా ఉందికదా అని ఎక్కువ తింటే మాత్రం మలబద్దకం వ‌స్తుంది. మనం నిత్యం ఎదుర్కునే ఎన్నో అనారోగ్యాలకు పటిక వైద్యం అద్భుతంగా పనిచేస్తుంది.

అరటిపండును పటికబెల్లం పొడితో అద్దుకొని తింటూ ఉంటే నీళ్ల విరేచనాలు త‌గ్గుతాయి. పటికబెల్లం పొడిని, పసుపు పొడిని నిప్పుల మీద చల్లి దాని వాసన రెండు పూటలా పీలుస్తూ ఉంటే జలుబు, పడిశం వంటివి తగ్గిపోతాయి. పటికబెల్లం పొడి 3 గ్రాములు, ఒక టీ స్పూన్ పుదీనా ఆకుల రసం కలిపి రోజూ రెండు లేక మూడు పూటలు సేవిస్తూ ఉంటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి. దీంతో అతిమూత్రం సమస్య తగ్గిపోతుంది. కొంచెం పటికబెల్లం చూర్ణాన్ని నీటిలో కలిపి కరిగించి వడపోసి ఆ నీటిని రెండు లేక మూడు చుక్కలు కళ్ల‌లో వేసుకుంటే క‌ళ్ల‌ కలకలు త‌గ్గిపోతాయి. పటికను, నల్ల మిరియాల పొడి మరియు నెయ్యితో రాత్రి తీసుకుంటే గొంతు పూత తగ్గిపొతుంది.

శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు అలసట అనిపిస్తుంది. తక్కువ హిమోగ్లోబిన్ స్థాయి ఉన్న వాళ్ళు రక్తహీనత, పాలిపోయిన చర్మం,మైకం మరియు నీరసం వంటి సమస్యలతో బాధపడతారు. పటిక బెల్లం హిమోగ్లోబిన్ స్థాయి పెంచడమే కాకుండా రక్త ప్రసరణని పునరుద్ధరిస్తుంది. భోజనం తర్వాత పటిక ముక్కలను సొంపుతో కలిపి తీసుకుంటే జీర్ణక్రియలో సహాయం చేస్తుంది. ఉదయాన్నే నిద్రలేచి, పటికబెల్లం నీటిని క్రమం తప్పకుండా తీసుకోండి. నోటి పుండు ఉంటే, ఏలకులతో పటిక బెల్లం కలపడం ద్వారా పేస్ట్ తయారు చేసి, ప్రతిరోజూ ఉదయం నీటితో కలిపిన ఈ పేస్ట్ త్రాగాలి. ఇలా చేయడం ద్వారా నోటి బొబ్బలు మాయమవుతాయి.

వేడివేడి పాలల్లో పటికబెల్లం పొడి కలిపి రెండు లేక మూడు పూటలు తాగితే అతిగా మాట్లాడటం వలన వ‌చ్చే గొంతు బొంగురు తగ్గిపోతుంది. నిమ్మపండు ముక్క మీద కొద్దిగా పటికబెల్లం పొడి అద్ది బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే వాంతులు తగ్గిపోతాయి. మీరు భోజనం చేసిన తరువాత నోరు కడుక్కోకపోయినా, నోరు పుక్కిలించకపోయినా, ఆ బాక్టీరియా చిగుళ్ళ సందుల్లో ఉండిపోయి చెడు వాసన కలిగిస్తుంది. పటిక బెల్లం భోజనం తరవాత తింటే ఈ చెడు వాసన పోగొట్టి తాజా శ్వాస నింపుతుంది.

Related News