logo

  BREAKING NEWS

ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |  

ఎలాంటి అనారోగ్యాన్నైనా తరిమికొట్టే అద్భుతమైన ఆహారం రాగులు

దక్షణ భారతీయుల ఆహారపు అలవాట్లలో రాగులది ప్రత్యేక స్థానం. మన దేశంలో నాలుగు వేల ఏళ్ల కిందటే వీటిని సాగు చేయటం ప్రారంభించారు. సింధు నాగరికత సమయంలో రాగులు మన ఆహారంలో ముఖ్య భాగంగా మారాయి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు మరుగున పడిపోయాయి. అయితే యాంత్రిక జీవనంలో శారీరక శ్రమ తగ్గి, మానసిక శ్రమ పెరగడంతో శరీరానికి అనేక రకాలైన జబ్బులు వస్తున్నాయి.

దీంతో కొంతమంది వైద్య నిపుణుల సూచనలతో ఇప్పుడు అందరి దృష్టి వీటి వైపు మళ్లింది. రాగులను మిల్లెట్స్ అని కూడా పిలుస్తారు. రాగులని ఏ రూపంలో తీసుకున్నా శరీరానికి బలమే. రాగి మాల్ట్, రాగి లడ్డు, రాగి దోసెలు ఇలా వివిధ రకాలుగా రాగులను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే ఆహార పదార్తలలో రాగులు ఒకటి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించి టైఫాయిడ్ వంటి విషజ్వరాల ముప్పును ఇవి తగ్గిస్తాయి. వరిలో ఉన్నంత ప్రోటీన్ రాగులలో లభిస్తుంది. రాగులను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

బరువు తగ్గడానికి రాగులు:
బరువు తగ్గాలనుకునే వారు ఫైబర్ అధికంగా గల రాగులు తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఫైబర్ పుష్కలంగా ఉండే రాగులను ఆహారంలో తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.రాగుల్లో అమినోయాసిడ్స్ వీటిన ట్రిప్టోఫాన్ అనే అమినోఆమ్లం కలిగి ఉండటం వల్ల రాగులు ఆకలి తగ్గిస్తుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది. రాగిపిండితో తయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది . అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది. మరియు రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది.

ఎముకల ఆరోగ్యం కోసం రాగి:
రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, దంతాలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి. ఎదిగే పిల్లలకు చాలా మేలు చేస్తుంది. రాగులను తీసుకోవడం వల్ల వారిలో ఎముకలు దృఢంగా ఉంటాయి. పాలు మరియు డయిరీ ఉత్పత్తులు పడని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయ ఆహరం. మహిళల్లో ఒక వయసు తర్వాత తలెత్తే కాల్షియం సమస్యను రాగులతో ఎదుర్కోవచ్చు.

వయస్సును తగ్గిస్తుంది :
రాగులలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వయస్సును తక్కువగా కనబడేలా చేస్తుంది. రాగులను క్రమంతప్పకుండా వినియోగిస్తుంటే, పోషకాహార లోపం, వృద్ధాప్యంను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. రాగి ముద్దను రోజూ తినడం వల్ల చిన్న వయస్సులోనే పెద్దవారిగా కనబడకుండా చేస్తుంది. ఇది కణాల రిపేర్ కు సహాయపడుతుంది. చర్మం కాంతివంతంగా కనబడేలా చేస్తుంది. జుట్టు ఊడే సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది.

మధుమేహానికి రాగులు:
మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో చక్కర నిల్వలను రాగులు నియంత్రిస్తాయి. రాగుల్లోని ఫైటోకెమికల్స్ జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. దీంతో రక్తంలోకి గ్లూకోజు త్వరగా విడుదల కాదు. ఇలా రక్తంలో గ్లూకోజు స్థాయిలు నియంత్రణలో ఉండేందుకు తోడ్పడతాయి. మధుమేహం ఉన్న వారిలో గాయాల్ని తొందరగా తగ్గించడానికి ఇవి సహకరిస్తాయి.

రక్త హీనత రాగులు:
రక్తహీనత సమస్యతో బాధపడేవారికి రాగులు చక్కని ఔషధం అని చెప్పవచ్చు. వీటిల్లో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. దీంతో రక్త హీనత సమస్య పోతుంది. యుక్త వయసు స్త్రీలలో రక్తహీనత కారణంగా ఎదురయ్యే అనేక సమస్యలు దూరమవుతాయి. డిప్రెషన్‌, నిద్రలేమి, మానసిక ఒత్తిడి తదితర సమస్యలను నయం చేసే గుణాలు రాగుల్లో ఉన్నాయి. తలనొప్పిని కూడా ఇవి తగ్గిస్తాయి. శరీరానికి ప్రశాంతతను చేకూరుస్తాయి.

అధిక రక్తపోటు తగ్గిస్తుంది:
అధిక రక్తపోటు, ఇతర కరోనరీ వ్యాధులతో బాధపడుతున్నవారికి ఫైబర్ ఫుష్కలంగా ఉన్నటువంటి రాగులు బాగా సహాయపడుతాయి. అధిక రక్తపోటు నివారిణిగా: రోస్ట్ చేసిన రాగులను తీసుకోవడం మేలు చేస్తుంది. అధిక రక్తపోటు సమస్యను తాగించడానికి రాగి మాల్ట్ దివ్యౌషధం లా పనిచేస్తుంది.

గుండె ఆరోగ్యానికి రాగులు
రాగులు ట్రైగ్లిసరైడ్స్‌ ఏర్పడకుండా చేసి గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. చిన్న వయసులోనే హార్ట్‌ ఎటాక్స్‌గానీ, స్ట్రోక్స్‌ గానీ రాకుండా చేస్తాయి. కాలేయవ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం తగ్గిస్తుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి.

Related News