logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

భోజనం తర్వాత వేసే ఏకైక యోగాసనం.. ప్రయోజనాలు అనేకం!

యోగాసనాలను ఎప్పుడు పడితే అప్పుడు వేయడం సాధ్యం కాదు. అందుకు నిర్దిష్ట సమయం అవసరం. కానీ 24 గంటల వ్యవధిలో ఏ సమయంలోనైనా వేసే అత్యంత తేలికైన ఆసనం ఏదైనా ఉందా అంటే అది వజ్రాసనం మాత్రమే. అయితే తేలికైన ఆసనం కదా అని లైట్ తీసుకుంటారేమో.. ఈ ఆసనం ప్రయోజనాలు తెలిస్తే ఎవరైనా వెంటనే ఆచరణలో పెడతారు.

వజ్ర అంటే సంస్కృతంలో ‘దృఢ’ అని అర్థం. క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తే శరీరంలో పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది. ఈ ఆసనాన్ని భోజనం తర్వాత కూడా వేయవచ్చు. అంతేకాదు ఈ ఆసనం వేస్తూ టీవీ చూడటం, పేపర్ చదవడం ఏదైనా చేయవచ్చు. ప్రాణాయామం, మెడిటేషన్ లాంటివి చేస్తే మరింత ప్రయోజనకరం. ఈ ఒక్క ఆసనం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం..

మలబద్దకాన్ని నివారిస్తుంది:
శరీరంలోని అన్ని అవయవాల పై ఒత్తిడి తీసుకువచ్చే అద్భుతమైన ఆసనం ఇది. ఈ భంగిమలో అబ్డోమిన్ (పొట్టి కడుపు), పొట్ట, ప్రేగుల మీరు ఒత్తిడి చేరుతుంది. దీని వాళ్ళ మలబద్దకం సమస్య తలెత్తదు. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మల బద్దకంతో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగకరమైన ఆసనం.

డిప్రెషన్ దూరం:
ఈ వజ్రాసన భంగిమ అన్ని రకాల ఒత్తిడులను దూరం చేస్తుంది. మోకాళ్లపై కూర్చుని వేసే ఈ ఆసనం వల్ల వెన్ను, కాళ్ళను సాగదీస్తుంది. జాయింట్స్, మజిల్స్ కు విశ్రాంతి లభిస్తుంది. ఈ ఆసనం వేసిన తర్వాత శరీరం రిలాక్స్ అయిన భావన కలుగుస్తుంది. ఎలాంటి మానసిక ఒత్తిడి అయినా ఇట్టే ఎగిరిపోతుంది. ఇది ఈ ఆసనానికి ఉన్న ముఖ్యమైన ప్రత్యేకత. ఈ ఆసనం ఇంకా ప్రయోజనకరంగా ఉండాలంటే ఈ ఆసనం వేసి దీర్ఘ శ్వాస తీసుకోవాలి.

అధిక బరువును తగ్గిస్తుంది:
అధిక బరువుతో బాధపడేవారు కచ్చితంగా వజ్రాసనం ప్రయత్నించాలి. పొట్ట, తొడలు ఇతర శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును ఇది క్రమంగా తగ్గిస్తుంది. అంతేకాదు తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం చేసి శరీరంలో వ్యర్థ పదార్థాలు, కొవ్వు లేకుండా చేస్తుంది.

ఇతర వ్యాధులకు:
వజ్రాసనం వల్ల వెరికోస్ వైన్స్(సిరల వాపు), కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి వ్యాధులను నివారిస్తుంది. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

వజ్రాసనం ఎలా వేయాలి:

1. కూర్చుని రెండు కాళ్ళ ను ముందుకు చాపాలి.
2. కుడి కాలుని మడిచి కుడి తొడ కింద పెట్టాలి. అప్పుడు పాదం వెనకకు చూస్తుంది.
3. ఎడమ కాలుని కూడా మడిచి ఎడమ తొడ కిందకి తేవాలి. ఈ భంగిమలో రెండు కాళ్ళ మడమలపై కూర్చుంటాము.
4. రెండు చేతులను తొడలపై ఉంచాలి. ఈ స్థితిలో శరీరం నిటారుగా మారుతుంది.
5. ఇలా కాసేపు ఉండి నెమ్మదిగా గాలి పీల్చుతూ వదులుతూ ఉండాలి.
6. ఆసనం పూర్తయ్యాక ఎడమ కాలును ఎడమ తొడ కింద నుండి తీసి ముందుకు చాపాలి.
7. కుడికాలును కుడి తొడ కింద తీసి ముందుకు చాపాలి.
8. కొంతసేపు విశ్రాంత స్థితిలో ఉండాలి.

Related News