logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

రోజూ 30 నిముషాల నడిస్తే చాలు డాక్టర్ అవసరం రాదట!

ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం పై శ్రద్ధ చూపడం ఎంతో అవసరం. అందుకు సమతుల ఆహరం, వ్యాయామానికి మించిన ఔషధం మరొకటి లేదని వైద్యులు చెప్తారు. కానీ అందరికీ వ్యాయామం చేయడానికి అనుకూలమైన పరిస్థితులు, సమయం ఉండకపోవచ్చు. అలాంటి వారు రోజులో కేవలం 30 నిమిషాలు నడక కోసం కేటాయిస్తే చాలు. జీవితంలో ఈ అలవాటును భాగం చేసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటిస్, బీపీ లాంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. అంతేకాదు రోజులో30 నిమిషాల నడక వల్ల మీరు నమ్మలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు అవేంటో తెలుసుకుందాం..

రోజా వాకింగ్ చేస్తే గుండె సమస్యలు, హార్ట్ అట్టాక్ లు రావు. హైబీపీ, కొలెస్ట్రాల్స్ సమస్య అసలే ఉండదు. శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీంతో ఆక్సిజన్ ఎక్కువగా గ్రహించి దానిని గుండెకు చేరవేస్తుంది. ఊపిరితిత్తులలలోని విష పదార్థాలను బయటకు పంపి శ్వాస సమస్యలు రాకుండా చేస్తుంది. కీళ్ల నొపు తగ్గుతాయి. కండరాలు ధృడంగా మారతాయి. మరో నమ్మలేని విషయం ఏమిటంటే నడక వల్ల పాదాల్లో ఉండే కంటికి సంబందించిన నరాలపై ఒత్తిడి కలిగి కంటి చూపు మెరుగవుతుంది.

ఉద్యోగ రీత్యా ఎక్కువగా కూర్చోవలసి రావడంతో బ్యాక్ పెయిన్ సమస్య వస్తుంది. వాకింగ్ చేస్తే ఈసమస్య తగ్గుతుంది. రక్త సరఫరా పెరిగి నొప్పి ఉన్న ప్రాంతంలో కండరాలకు స్వాంతన కలుగుతుంది. అంతే కాదు నడక వల్ల డిప్రెషన్ తగ్గి మంచి మూడ్ లోకి వస్తారని అధ్యయనాలు చెప్తున్నాయి. వాకింగ్ చేయడం వల్ల కడుపులోని పేగులలో కదలిక వస్తుంది. అప్పుడు అవి సరైన స్థితిలో కి వస్తాయి. విరేచనం సాఫీగా అవుతుంది. మలబద్ధకం, జీర్ణాశయ సమస్యలు రాకుండా నివారిస్తుంది. రోజూ వాకింగ్ చేసేవారిలో డయాబెటిస్ ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

అయితే జాగింగ్, వాకింగ్ లలో ఏది మంచిది అనే ప్రశ్నకు సమాధానం మీరు ఎదుర్కుంటున్న ఆరోగ్య సమస్యలను బట్టి ఉంటుంది. ఉదాహరణకు మీరు అధిక బరువు సమస్యతో బాధపడుతుంటే వాకింగ్ చేయడం వలన వెంటనే ఫలితాలు రాకపోవచ్చు. అదే జాగింగ్ అయితే ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు సమస్యలు లేవు. కానీ ఫిట్ గా ఉండాలి అనుకుంటే వారికి నడక చాలా మంచిది. అలాగే మీరు ఏ వయసులో ఉన్నారనే విషయం కూడా చాలా ముఖ్యం. యుక్తవయసులో ఉన్న వారు జాగింగ్ చేయచ్చు. 50 ఏళ్ళు పైబడిన వారు గుండెపై ఎక్కువ ఒత్తిడి కలగకుండా వాకింగ్ చేస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి.

Related News