logo

  BREAKING NEWS

బ్రేకింగ్: మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!  |   ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!  |   అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?  |   ప‌ద్మ‌విభూష‌ణ్‌, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌తో ఎంత డ‌బ్బు ఇస్తారో తెలుసా ?  |   హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ  |   ఏపీ పంచాయతీ వార్: జగన్ సర్కార్ ఆదేశాలకు ఎస్ఈసీ నో..!  |   తెలంగాణలో కొత్త పార్టీ.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల!  |   సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |   బ్రేకింగ్: ఎన్నికలపై సుప్రీం తీర్పు: నిమ్మగడ్డ సంచలన నిర్ణయం!  |  

బీపీ, షుగ‌ర్‌, కీళ్ల నొప్పులు, చ‌ర్మ, జుట్టు స‌మ‌స్య‌లకు ప‌రిష్కారం నువ్వుల నూనె

మ‌నం ప‌చ్చ‌ళ్లు పెట్ట‌డానికి నువ్వుల నూనెను ఎక్కువ‌గా వినియోగిస్తుంటాం. కానీ, నువ్వుల నూనెను కేవ‌లం ప‌చ్చ‌ళ్ల‌కే ప‌రిమితం చేయ‌వ‌ద్ద‌ని, ప్ర‌తీ రోజూ నువ్వుల నూనెను వివిధ ప‌ద్ధ‌తుల్లో వినియోగించడం వ‌ల్ల ఆరోగ్యానికి చాలా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు. అన్ని నూనెల్లోనూ నువ్వుల నూనె శ్రేష్ట‌మైన‌ది. నువ్వుల నూనెలోని ఓమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్‌, ప్రోటీన్లు, పిండిప‌దార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖ‌నిజ ల‌వ‌ణాలు, కాల్షియం, జింక్‌, ఐర‌న్ థ‌యామిన్‌, విట‌మిన్ ఇ, బి ఆరోగ్యానికి, శ‌రీర సౌంద‌ర్యానికి చాలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

నువ్వుల నూనె చ‌ర్మాన్ని కాపాడ‌టానికి చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో ఉండే విట‌మిన్ ఇ, బి చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది. నువ్వుల నూనె చ‌ర్మానికి రాస్తే చ‌ర్మం కోమ‌లంగా త‌యారై కొత్త మెరుపు వ‌స్తుంది. ఈ నూనెను కొంచెం వేడి చేసి చ‌ర్మంపై మ‌సాజ్ చేసుకుంటే చ‌ర్మం నిగారింపు పెరుగుతుంది.

వెంట్రుక‌ల‌కు కూడా నువ్వుల నూనె చాలా మంచిది. నువ్వుల నూనె త‌ల‌కు పెట్టుకుంటే వెంట్రుక‌లు ఊడిపోకుండా, జుట్టు ఒత్తుగా పెరిగేందుకు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. చుండ్రు స‌మ‌స్య‌కు కూడా నువ్వుల నూనె బెస్ట్ సొల్యూష‌న్ తెల్ల జుట్టు రాకుండా కాపాడ‌టంతో పాటు పేను కోరుకుడు స‌మ‌స్య కూడా త‌గ్గిపోతుంది. నువ్వుల నూనె పెట్టుకుంటే జుట్టు బాగా పెర‌గ‌డానికి కావాల్సిన అన్ని పోష‌కాలు అందుతాయి.

కీళ్ల నొప్పులు ఉన్న వారు నువ్వుల నూనెలో కొంచెం శింఠి పొడి, కొంచెం ఇంగువ పొడి వేసి వేడి చేసి మ‌సాజ్ చేసుకుంటే త్వ‌ర‌గా నొప్పులు త‌గ్గిపోతాయి. నువ్వుల్లో కాప‌ర్ మూల‌కాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పుల‌ను, వాపుల‌ను త‌గ్గిస్తాయి. నువ్వుల్లో స‌మృద్ధిగా ఉండే జింక్ ఎముక‌లు గ‌ట్టిప‌డేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

నువ్వుల నూనె చిన్నారుల‌కు చాలా మంచి చేస్తుంది. స్నానం చేయించే ముందు ప‌సి పిల్ల‌ల మాడు, శ‌రీరానికి నువ్వుల నూనెతో మ‌ర్ద‌న చేయాలి. నువ్వుల నూనె పిల్ల‌ల మెద‌డు ఎదుగుద‌ల‌, శ‌రీర పుష్టికి బాగా ఉప‌యోప‌డుతుంది.

షుగ‌ర్ వ్యాధిని అదుపులో పెట్టేందుకు నువ్వుల నూనె ఔష‌దంలా ప‌ని చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం, ఇత‌ర పోష‌కాలు మ‌ధుమేహాన్ని త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. జ‌లుబును కూడా నువ్వుల నూనె త‌గ్గిస్తుంది. సాధార‌ణ జ‌లుబుతో బాధ‌ప‌డే వారు నువ్వుల నూనె వాస‌న పీలిస్తే జ‌లుబు త‌గ్గి, శ్వాస తీసుకోవ‌డంతో ఇబ్బంది పోతుంది.

ఆహారంలో నువ్వుల నూనెను వినియోగిస్తే స్త్రీల‌లో ఉండే హార్మోన్ల స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంది. ఇందులోని ఒమెగా – 3 ఫాటీ ఆమ్లా బీపీని కూడా అదుపులో ఉంచుతుంది. దంత స‌మ‌స్య‌లు, చిగుళ్ల స‌మ‌స్య‌లు, చిగుళ్ల నుంచి ర‌క్తం కార‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా నువ్వుల నూనెతో త‌గ్గిపోతాయి. కాబ‌ట్టి, నువ్వుల నూనెను ఎక్కువ‌గా వినియోగించ‌డం అన్ని ర‌కాలుగా మంచిది.

Related News