logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

వంటల్లో ఇంగువను వాడుతున్నారా? అయితే ఇది మీకోసమే..

కొన్ని శతాబ్దాలుగా ఇంగువ భారతీయుల ఆహారంలో భాగంగా ఉంది. ఇంగ్లీష్‌లో దీనిని అసోఫెటిడా (asofetida) అని పిలుస్తారు. లాటిన్‌లో అసోఫెటిడా అంటే దుర్గంధంగా ఉండే జిగురు పదార్ధం అని అర్ధం. ఒక్క భారత దేశంలోనే 40 శాతం మంది ప్రజలు ఇంగువను ఉపయోగిస్తున్నారు. పర్షియన్లు దీనిని దేవతల ఆహారంగా పిలుస్తారు. అయితే ఈ పదార్థాన్ని మన దేశంలో మాత్రం పండించరు. ఇక్కడి వాతావరణ పరిస్థితులు ఈ పంటకు అనుకూలంగా వుండకపోవడమే ఇందుకు కారణం. ఊదా, తెలుపు కలగలిపిన రంగులో ఉండే జిగురు పదార్థాన్ని మొక్క వేళ్ళ నుంచి సేకరిస్తారు. దీనిని ఎండబెట్టి గోధుమ పిండితో గాని బియ్యం పిండితోగాని కలిపి వంటల్లో వాడుకునేందుకు అనువుగా తయారు చేస్తారు.

మన వాళ్ళు తాలింపులో కాస్త ఇంగువను కలిపి వండుతారు. ఇతర మసాలా దినుసులతో ఇంగువ కలిసినప్పుడు ఇదొక రహస్యమైన రుచిని కలిగిస్తుంది. అందుకే వంటకాలలో ఇంగువ రుచిని చాలా మంది ఇష్టపడుతుంటారు. రుచికోసం మాత్రమే కాదు ఇంగువలో కొన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇంగువను పురాతన కాలం నుంచి అజీర్తికి ఇంటి వైద్యంగా ఉపయోగిస్తారు. ఇందులో జీర్ణాశయ సమస్యలను తగ్గించే గుణం ఉంది. ఇంగువలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కడుపులో మంట, ఉబ్బరం, అజీర్తి, పేగులకు సోకె అనేక రకమైన వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

ఒక అరకప్పు నీటిలో చిన్న చిన్న కొన్ని ఇంగువ ముక్కలను కరగించి తీసుకొంటే అజీర్తి, ఋతుసమస్య నుండి వెంటనే ఉపశమనం కల్గుతుంది. వంటలలో ఉపయోగించే ఈ ఔషధ మూలికను మగవారిలో నపుంసకత్వం తగ్గించేందుకు కూడా వాడతారు. పూర్వకాలంలో ఇంగువని అంటువ్యాధులు, శ్వాస సంబంధిత వ్యాధులను తగ్గించడానికి ఉపయోగించేవారు. ఛాతిలో కఫము, ఛాతీ బరువు తగ్గించి శ్వాసను ఉత్తేజితం చేస్తుంది. తేనె, అల్లంతో ఇంగువను కలిపి తీసుకుంటే కోరింత దగ్గు, శ్వాస నాళాల వాపు, పొడిదగ్గు, ఉబ్బసం నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఇంగువను డయాబెటిస్ వైద్యంలో కూడా వాడతారు, ఇది క్లోమ కణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి ఇన్సులిన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేసేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి కాకర కాయను ఇంగువతో కలిపి వండుతారు. ఇంగువలో రోగ నిరోధక శక్తి ఉంది. గాయాలు, చర్మ వ్యాధులకు ఇంగువ మంచి మందు. ఇంగువను నీటితో కలిపి చర్మంపై పూయవచ్చు. పళ్ళు పుచ్చిపోయి ఉంటే రాత్రి పడుకునేముందు కాస్త ఇంగువ ఆ పంటిపై ఉంచితే క్రిములు నశిస్తాయి. మలబద్ధకం ఉన్నవారు రాత్రి పడుకో బోయేముందు ఇంగువ చూర్ణం తీసు కుంటే ఫలితం ఉంటుంది.

ఇంగువ శరీరంలో క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. నీటిలో ఇంగువను కరిగించి తీసుకొంటే మైగ్రియిన్లు, తలనొప్పులను తగ్గిస్తుంది. నిమ్మరసంతో కలిపిన చిన్న ఇంగువ ముక్కను పంటి కింద ఉంచితే పంటి నొప్పి తగ్గుతుంది. ఇందులో ఉండే కొమిరిన్లు రక్తాన్ని పలుచన చేసి గడ్డకట్టకుండా చేస్తాయి. అధిక రక్తపోటును తగ్గిస్తాయి. మూర్ఛ, సొమ్మసిల్లి పడిపోవడం వంటి నాడీ సంబంధిత వ్యాధులను కూడా చిటికెడు ఇంగువతో నయం చేయవచ్చని ఆయుర్వేదం చెప్తుంది.

 

Related News