logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

చ్యవన్ ప్రాశ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

కరోనా కారణంగా ప్రజలు సరికొత్త జీవన శైలిని అలవర్చుకుంటున్నారు. ఆరోగ్యానికి, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలనే అవగాహన ప్రజల్లో ఏర్పడింది. దీంతో వీరి కొనుగోళ్లలో కూడా భారీగా మార్పులు ఏర్పడ్డాయి. ఆమ్లా, తేనె, ఆవు నెయ్యి, చ్యవన్ ప్రాశ్, హెర్బల్ మెడిసిన్ లో ఇలాంటి గుణాలు ఉండటం వల్ల వీటికి భారీగా ఆదరణ పెరిగింది. కరోనా కాలంలో వీటి కొనుగోళ్లు రికార్డు సృష్టించాయనే చెప్పాలి. ముఖ్యంగా కరోనా బారిన పడి కోలుకున్న వారు వీటితో పాటుగా చ్యవన్ ప్రాశ్ ను సేవించాలని కేంద్ర ప్రభుత్వం కూడా సూచించింది.

అంతకు ముందు దీని గురించి చాలా మందికి తెలిసి ఉండదు. కానీ మన దేశంలో చ్యవన్ ప్రాశ్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఇది అనేక వ్యాధులను పోగొట్టే ఒక ప్రాచీనమైన ఆయుర్వేద ఫార్ములా. ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తున్న వారు చ్యవన్ ప్రాశ్ ఆరోగ్య ప్రయోజనాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. చ్యవన్ ప్రాశ్ ను వెండి, బంగారంతో పాటుగా 49 రకాల మూలికా పదార్థాలను కలిపి తయారు చేస్తారు.

నల్లగా, జామ్ లాగా కనిపించే దీనిని ప్రతి రోజు రెండు పూటలా 100 రోజుల పాటు తీసుకుంటే శరీరంలో చోటుచేసుకునే అద్భుతమైన మార్పులను మీరే గమనిస్తారు. కొన్ని రకాల అంటు వ్యాధులు, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. గుండె వ్యాధులు, జలుబు, గురక, దగ్గు, ఛాతీ నొప్పిని తగ్గించడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది.

న్యుమోనియా, మలబద్ధకం, ఉబ్బసం తగ్గిస్తుంది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. చ్యవన్ ప్రాశ్ ను తీసుకోవడం వలన శరీరాన్ని ఆరోగ్యంగా ఉందుకోవడమే కాదు సెక్స్ జీవితానికి సంబందించిన అనేక సమస్యలను కూడా ఇది దూరం చేస్తుంది. చాలా మందికి కొలెస్ట్రాల్ సమస్య ఏర్పడుతుంది. అలాంటి వారు క్రమం తప్పకుండా దీనిని తీసుకుంటే వారికిక ఆ సమస్య ఉండదు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను ఇది నియంత్రణలో ఉంచగలదు. మహిళలు ఎదుర్కునే అనేక సమస్యల్లో రుతుక్రమం సమస్య ఒకటి.

చాలా మంది స్త్రీలను కడుపు నొప్పి వేధిస్తుంటుంది. అలాగే రుతు చక్రం మొదలయ్యే ముందు చోటుచేసుకునే అనేక మార్పులు ఇబ్బంది పెడుతుంటాయి. వీటన్నిటికీ చ్యవన్ ప్రాశ్ తో చెక్ పెట్టవచ్చు. మీరు ఉత్సాహంగా ఉండలేకపోతున్నారా? ప్రతి విషయంలోనూ నిరాశకు లోనవుతున్నారా? అయితే కొన్ని నెలల పాటు చ్యవన్ ప్రాశ్ ను తీసుకోండి. ఇది వెంటనే ఎలాంటి ఫలితాల్ని చూపదు. కానీ క్రమంగా మీ మూడ్ మారుతుండటం, ప్రతి విషయాన్నీ సానుకూల దృక్పథంతో చూడటం మీరు గమనిస్తారు. దీనిని తీసుకునే వారిలో ముఖ్యంగా బీపీ అదుపులో ఉంటుంది.

కాలేయం, పేగుల నుంచి మలినాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తంలో తగినంత హిమోగ్లోబిన్ లేకపోతే మీరు దీనిని క్రమం తప్పకుండా తీసుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. బరువు పెరిగే సమస్య ఉన్నవారు, గోర్లు, జుట్టు పెరుగుదలను కోరుకునే వారికి కూడా ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే షుగరు వ్యాధి ఉన్నవారికి, చిన్న పిల్లలకు దీనిని ఇవ్వాలనుకుంటే మాత్రం వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు 20 నిమిషాల ముందు, రాత్రి పడుకోబోయే ముందు చ్యవన్ ప్రాశ్ ను అర స్పూన్ తీసుకోవాలి.

Related News