logo

  BREAKING NEWS

మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |   నువ్వు దేవుడివి సామీ.. 1020 మంది చిన్నారుల‌కు ప్రాణాలు పోసిన మ‌హేష్  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న త్రివిక్ర‌మ్‌  |   తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |  

50 కోట్ల డోసులు సిద్ధం చేస్తాం.. క‌రోనా వ్యాక్సిన్‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

క‌రోనా వైర‌స్ కేసులు, మ‌ర‌ణాలు రోజురోజుకూ పెరుగుతున్న నేప‌థ్యంలో ఇప్పుడు అందరి ఆశ‌లూ క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ పైనే ఉన్నాయి. ఇప్ప‌టికే ర‌ష్యా, చైనా త‌మ పౌరుల‌కు క‌రోనా వ్యాక్సిన్‌ను అందిస్తున్నాయి. ముఖ్యంగా క‌రోనా వారియ‌ర్స్‌గా పిలిచే వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి ముందు వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే, ఈ రెండు దేశాల వ్యాక్సిన్‌ల‌పైన ప‌లు అనుమానాలు ఉన్నాయి. ర‌ష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి మూడో ద‌శ ట్ర‌య‌ల్స్ పూర్తి చేసుకోలేద‌నే ప్ర‌చారం ఉంది.

చైనా త‌యారుచేసిన తీసుకున్న ఆ దేశ ప్ర‌జ‌ల్లో కొంద‌రికి ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ప‌రిశోధ‌న‌లు జ‌రుపుకుంటున్న వ్యాక్సిన్‌ల‌పైనే అన్ని దేశాలు ఆశ‌లు పెట్టుకున్నాయి. త‌మ వ్యాక్సిన్ వ‌చ్చే ఏడాది మొద‌టి అర్థ‌భాగంలో రావ‌చ్చ‌ని ఆక్స్‌ఫర్డ్ యూనివ‌ర్సిటీ ప్ర‌క‌టించింది. మిగ‌తా వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చే ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

అయితే, వ్యాక్సిన్ వ‌చ్చినా 130 కోట్ల మంది జ‌నాభా క‌లిగిన భార‌తదేశంలో మ‌న వ‌ర‌కూ వ్యాక్సిన్ ఎప్పుడు అందుతుంది ? క‌రోనా వ్యాక్సిన్‌ను మ‌న డ‌బ్బుల‌తో కొనుగోలు చేసే అవ‌కాశం ఉంటుందా ? ప‌్ర‌భుత్వ‌మే ప్ర‌జ‌లంద‌రికీ వ్యాక్సిన్ అందిస్తుందా ? వ‌ంటి అనేక అనుమానాలు మ‌న‌లో ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో వ్యాక్సిన్‌ను పంపిణీ చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్న ప్ర‌ణాళిక ఏంట‌ని ఇటీవ‌ల ప్ర‌తిప‌క్ష పార్టీలు కూడా ప్ర‌శ్నిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో మ‌న దేశంలో వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన కీల‌క వివ‌రాల‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ వెల్ల‌డించారు. వ‌చ్చే ఏడాది జులై నాటికి దేశంలో 20 నుంచి 25 కోట్ల మందికి స‌రి‌ప‌డేలా క‌రోనా వ్యాక్సిన్‌ను సిద్ధం చేసేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. మొత్తం 40 నుంచి 50 కోట్ల డోసుల క‌రోనా వ్యాక్సిన్ డోసుల‌ను సిద్ధం చేసేందుకు కేంద్రం ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. అంటే, ఒక్కో పౌరుడికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వ‌నున్నారు.

మొద‌టి ద‌శ‌లో క‌రోనాపై పోరులో ముందున్న ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, వైద్యులకు క‌రోనా వ్యాక్సిన్ అందించ‌నున్న‌ట్లు మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే వ్యాక్సిన్ పంపిణీకి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల కోసం ఒక ఉన్న‌త స్థాయి క‌మిటీని సైతం మ‌న కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఎవ‌రికి ముందు వ్యాక్సిన్ అందించాల‌నేది ఈ క‌మిటీనే ఒక ఫార్మాట్ సూచిస్తుంది. ఇదే ఫార్మాట్‌ను రాష్ట్రాల‌కు పంపిస్తుంది. ఈ ఫార్మాట్‌లో ఉన్న‌ట్లుగానే ప్రాధాన్య‌తాక్ర‌మంలో ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ అందిస్తుంది.

వ్యాక్సిన్ సేక‌రించే బాధ్య‌త‌ను పూర్తిగా కేంద్ర ప్ర‌భుత్వ‌మే తీసుకుంటుంది. వ్యాక్సిన్ సిద్ధ‌మైన త‌ర్వాత జ‌నాభావారీగా అన్ని రాష్ట్రాల‌కు స‌మానంగా, నిష్ప‌క్ష‌పాతంగా కేంద్రం కేటాయిస్తుంది. క‌రోనా నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు పోరాడుతున్న క‌రోనా వారియ‌ర్స్‌కు ముందుగా వ్యాక్సిన్ అందనుంది. అయితే, వ్యాక్సిన్‌కు ప్ర‌జ‌లే డ‌బ్బులు చెల్లించాలా లేదా ప్ర‌భుత్వ‌మే ఉచితంగా అందిస్తుంద‌నే విష‌యాన్ని ఇంకా స్ప‌ష్టం చేయ‌లేదు.

Related News