భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకా ఇటీవలే మూడో దశ ప్రయోగాలను చేపట్టింది. కాగా ఈ ట్రయల్స్ లో భాగంగా తాను టీకా వేయించుకుంటానంటూ హరియాణా హోమ్ మంత్రి అనిల్ విజ్ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆయనపై ఒక డోసును కూడా భారత్ బయోటెక్ ప్రయోగించింది.
కాగా అనిల్ విజ్ ఇప్పుడు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తొలి డోసు వేయించుకున్న రెండు వారాలకే ఆయనకు కరోనా నిర్దహరణ కావడంతో కోవగ్జిన్ సమర్ధతపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది.
కరోనా టీకాను రెండు డోసులు తీసుకున్న తర్వాత కొన్ని రోజుల సమయానికి శరీరంలో యాంటీ బాడీలను అభివృద్ధి చేస్తుంది. అయితే ఇప్పుడు హరియాణా హోమ్ మంత్రి అనిల్ విజ్ కు కరోనా సోకడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనిల్ విజ్ కు ఇంకా మొదట డోసు మాత్రమే ఇచ్చారని ఆరోగ్య శాఖా వివరించింది.
కరోనా టీకాలో భాగంగా ఇంట్రా మాస్క్యులార్ ఇంజక్షన్లను ఇస్తారు. ఒక డోసు ఇచ్చిన తర్వాత మరో డోసు ఇవ్వడానికి 28 రోజుల విరామం ఇస్తారు. కాబట్టి మంత్రికి కరోనా సోకడం సందేహించాల్సిన విషయం కాదని భారత్ బయోటెక్ స్పష్టత ఇచ్చింది.