logo

  BREAKING NEWS

ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |   బ్రేకింగ్‌: రైతుల కోసం జ‌గ‌న్ మ‌రో అద్భుత‌మైన ప‌థ‌కం  |   సోష‌ల్ మీడియాలో క‌నిపించే ఈ ఆఫ్రిక‌న్ బుడ్డోడి అస‌లు క‌థ ఇది  |   కరోనా రికార్డు.. 24 గంటల్లో 20,903 కేసులు.. 18 వేల మరణాలు!  |   లఢక్ కు చేరుకున్న ప్రధాని మోడీ.. దేనికి సంకేతం?  |   తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ..!  |  

ధోనీపై ఛాపెల్ వ్యాఖ్య‌లు.. తిప్పికొట్టిన భ‌జ్జీ

టీమిండియా క్రికెట‌ర్ ధోనీని మ్యాచ్ ఫినిషెర్‌గా మార్చాన‌ని టీమిండియా మాజీ కోచ్ గ్రేగ్ ఛాపెల్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. 2005లో శ్రీలంకతో మ్యాచ్‌లో ధోనీ 183 ప‌రుగులు సాధించిన త‌ర్వాత తాను ధోనీతో మాట్లాడాన‌ని, చివ‌రి వ‌ర‌కు క్రీజ్‌లో ఉండి మ్యాచ్‌ను గెలిపించాల‌ని అత‌డి ఛాలెంజ్ పెట్టే వాడిన‌ని ఛాపెల్ అన్నాడు. తాను పెట్టిన ఛాలెంజ్‌ను పూర్తి చేసి మ్యాచ్‌ను గెలిపించిన త‌ర్వాత ధోనీ ముఖంలో చిరున‌వ్వు చూసే వాడిన‌ని చెప్పుకొచ్చాడు. ప్ర‌తీసారి బౌండ‌రీలే కాకుండా సింగిల్స్‌, డ‌బుల్స్ ద్వారా ప‌రుగులు సాధించాల‌ని చెప్పాన‌ని ఛాపెల్ చెప్పాడు.

అయితే, ధోనీని మంచి ఫినిష‌ర్‌గా మార్చాన‌ని ఛాపెల్ చేసిన‌ ఈ వ్యాఖ్య‌ల‌పై మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ స్పందించాడు. అవును, ధోనీకి స్టేడియంలో ఆడ‌టం నేర్పింది ఛాపెలే, ఎందుకంటే స్టేడియం బ‌య‌ట అంద‌రూ ఛాపెల్‌ని ఆడుకునే వారు అని ఎద్దేవా చేశారు. ఛాపెల్ జ‌మానా భార‌త క్రికెట్‌లో చేదు రోజుల‌ని హ‌ర్బ‌జ‌న్ చెప్పాడు. ఛాపెల్ ఆడిన ఇత‌ర ఆట‌లే ఇందుకు కార‌ణ‌మ‌ని గ‌త సంఘ‌ట‌న‌లు హ‌ర్భ‌జ‌న్ గుర్తు చేశాడు. 2005 నుంచి 2007 వ‌ర‌కు టీమిండియా కోచ్‌గా గ్రేగ్ ఛాపెల్ ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే.

అత్యంత వివాదాస్ప‌ద కెప్టెన్‌గా ఛాపెల్ ముద్ర‌ప‌డ్డాడు. అప్ప‌టి కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ సిఫార్సు మేర‌కు, చాలా మంది ఛాపెల్ మ‌న‌స్త‌త్వాన్ని వ్య‌తిరేకించినా టీమిండియా కోచ్‌గా ఎంపికయ్యాడు. త‌ర్వాత ప్లేయ‌ర్ల మ‌ధ్య గొడ‌వ‌లు, సీనియ‌ర్ల‌ను టీమ్ నుంచి త‌ప్పించ‌డం వంటి చ‌ర్య‌ల‌తో ఛాపెల్ వివాదాలు సృష్టించాడు. త‌న‌ను టీమిండియా కోచ్‌గా ఎంపిక చేసే కెప్టెన్ గంగూలీని అవ‌మాన‌క‌ర రీతిలో టీమ్ నుంచి త‌ప్పించాడు. ఆ స‌మ‌యంలో గంగూలీ అభిమానుల ఆగ్ర‌హానికి ఛాపెల్ లోన‌య్యాడు. త‌ర్వాత గంగూలీ, స‌చిన్, యువ‌రాజ్‌, సెహ్వాగ్‌, హ‌ర్భ‌జ‌న్ లాంటి అప్ప‌టి క్రికెట‌ర్లు ఛాపెల్ కోచ్‌గా చేసిన త‌ప్పుల‌ను బ‌య‌ట‌పెట్టిన విష‌యం తెలిసిందే.

Related News