logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

‘ఆ వ్యాపార వేత్త ఎవరో నాకూ చెప్పండి’

కరోనా లాక్ డౌన్ కారణంగా సెలెబ్రిటీలంతా తమ భాగస్వామిని వెతుక్కునే పనిలో పడ్డారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా ఇప్పటికే పెళ్లి తేదీ కూడా చెప్పేసాడు. ‘సాహో’ దర్శకుడు సుజిత్ కూడా నిశ్చితార్థం చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి హన్సిక వంతు వచ్చింది.

‘దేశముదురు’ సినిమాతో తెలుగులో భారీ హిట్ కొట్టిన హన్సిక ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని నమోదు చేసుకోలేకపోయింది. తమిళనాట మాత్రం ఆమెకు మంచి క్రేజ్ ఉంది. సంచలన నటుడు శింబుతో కొంత కాలం రిలేషన్ ఉన్న హన్సిక ఆ తర్వాత బ్రేక్ అప్ చెప్పి కెరీర్ మీద దృష్టి పెట్టింది. ఇటీవల హన్సిక ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి.

ఆ విషయం కాస్త హన్సిక దృష్టికి వెళ్లడంతో ఆమె హాస్యాస్పదంగా స్పందించింది. ఆమె అభిమాని ఒకరు పెళ్లి వార్తపై స్పందిస్తూ ‘నాకు చెప్పనేలేదు’ అని కామెంట్ పెట్టాడు. అందుకు హన్సిక ‘నాకు కూడా ఇప్పుడే తెలిసింది’ అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చింది. ఆ వ్యాపారవేత్త ఎవరో మీకు తెలిస్తే నాకు కూడా చెప్పమని కోరుతుంది.

Related News