logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

వాహనదారులకు కేంద్రం కొత్త రూల్స్.. బైకులకు అవి తప్పనిసరి!

రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వాహన దారులకు కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. మోటార్ వెహికిల్ చట్టంలో ఈమేరకు కొన్ని మార్పులు చేసింది. అందులో ద్విచక్రవాహనాలు నడిపే వారికి కొత్త నిబంధనలు విధించింది. బైక్ మీద వెనకాల కూర్చునే వారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా కచ్చితంగా బైకులకు హ్యాండ్ హోల్డ్స్ ఉండాలని కేంద్రం సూచించింది.

అదే విధంగా వెనకాల కూర్చునే వాహనదారుల కోసం కాళ్ళు పెట్టుకునే విధంగా పెడల్స్, వెనుక టైర్ ఎడమవైపు భాగంలో సెక్యూరిటీ కవరింగ్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం తెలిపింది. అందుకు సంబందించిన గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కాగా 100 సీసీ బైకుల్లో ఇవి కనిపిస్తాయి. కానీ ఇటీవల విడుదలవుతున్న బైకుల్లో స్టైల్ కోసం ముందు వైపు మిర్రర్ లను తొలగించడం, సైడ్ పెడల్స్ ను తీసివేయడం వంటివి చేస్తున్నారు.

తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇప్పుడు అన్ని రకాల ద్విచక్రవాహనాలపై ఇవి తప్పనిసరి చేసింది. వీటి ద్వారా వాహనదారులకు కొంతవరకు రక్షణ ఉంటుంది. ఆర్టీవో కార్యాలయంలో ద్విచక్రవాహనాలపై రిజిస్టర్ చేసే సమయంలో కూడా పైన తెలిపిన రూల్స్ అన్ని పాటించిన వారికి మాత్రేమే వెహికిల్ రిజిస్టర్ చేస్తారు.

Related News