logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం.. దేశంలోనే తొలిసారిగా ఏపీ రికార్డ్!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు ప్రారంభమయ్యాయి. వర్చువల్‌ కాన్ఫరెన్సింగ్‌ ద్వారా గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వ్యాప్తి, అయన వయసును దృష్టిలో పెట్టుకుని ఆయనను అసెంబ్లీకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. దీంతో గవర్నర్ రాజ్ భవన్ నుంచే ఆన్ లైన్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.

మన దేశంలో గర్వర్నర్ ఇలా ఆన్లైన్ ద్వారా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. గవర్నర్ మాట్లాడుతూ.. గడిచిన ఏడాది కాలంలో తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందించిందన్నారు. ప్రజలు దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను 8.16 శాతం వృద్ధి రేటు సాధించడం సంతోషకరమన్నారు.

అదే విధంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 8 శాతం, పారిశ్రామిక రంగంలో 5 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. మానిఫెస్టోలో లేని 40 శాతం హామీలను కూడా తమ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఈ ఏడాదిలో వివిధ పథకాల ద్వారా రూ. 42 కోట్లను వెచ్చించి 3.98 కోట్ల మంది ప్రజలకు లబ్ది చేకూర్చమన్నారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 6.25 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందారన్నారు.

అందుకు రూ.1534 కోట్లు ఖర్చు చేశామన్నారు. పిల్లల చదువు, తల్లుల ఆరోగ్యం కోసం అమ్మఒడి పథకాన్ని తెచ్చామన్నారు. నాడు – నేడు మన బడి కార్యక్రమం ద్వారా రానున్న మూడేళ్ళలో 48 వేల పాఠశాలలను ఆధునికీకరిస్తామని తెలిపారు. జగనన్న గోరుముద్ద పథకంకోసం రూ. 1105 కోట్లు ఖర్చు చేశామన్నారు.

Related News