logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఫిబ్ర‌వ‌రి నాటికి స‌గం మందికి క‌రోనా వైర‌స్‌

క‌రోనా వైర‌స్ దేశంలో వేగంగా వ్యాపిస్తోంది. సెప్టెంబ‌ర్ 10 నాటికి దేశంలో 76 ల‌క్ష‌ల‌కు పైగా పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి. అయితే, ఈ లెక్క‌ల‌కు మించి దేశంలో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని ప‌లు అంచ‌నాలు ఉన్నాయి. చాలా మందికి ల‌క్ష‌ణాలు లేకుండానే క‌రోనా సోకి వెళ్లిపోతున్నందున లెక్క‌లకు మించి క‌రోనా కేసులు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలోని వివిధ న‌గ‌రాల్లో జ‌రిగిన సీరో స‌ర్వేలు కూడా ఇదే విష‌యాన్ని చెబుతున్నాయి.

తాజాగా ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప్రొఫెస‌ర్ మ‌ణీంద్ర అగ‌ర్వాల్ రానున్న రోజుల్లో దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఎంత వేగంగా జ‌రుగుతుందో అంచ‌నా వేస్తున్నారు. వ‌చ్చే సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి నాటికే దేశ జ‌నాభాలో క‌నీసం స‌గం మందికి క‌రోనా వైర‌స్ సోకే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న అంచ‌నా వేశారు. అంతేకాదు ఇప్ప‌టికే భార‌త్‌లో 30 శాతం మందికి క‌రోనా వైర‌స్ సోకి ఉండ‌వ‌చ్చ‌ని ఆయ‌న చెబుతున్నారు.

ప్ర‌భుత్వం దేశంలోని వివిధ ప్రాంతాల్లో సీరో స‌ర్వే నిర్వ‌హించింద‌ని, ఈ స‌ర్వేలోనే దేశంలోని 14 శాతం మందికి క‌రోనా వైర‌స్ సోకింద‌ని తేలింద‌ని ఆయ‌న చెబుతున్నారు. ప్ర‌భుత్వం సీరో స‌ర్వే కోసం తీసుకున్న శాంపిళ్లు త‌క్కువ కాబ‌ట్టి, సీరో స‌ర్వేలో తేలిన దాని కంటే ఎక్కువ క‌రోనా వ్యాప్తి ఉంద‌ని ఆయ‌న అంచ‌నా వేస్తున్నారు. త‌మ లెక్క‌ల ప్ర‌కారం దేశంలో ఇప్ప‌టికే 30 శాతం మంది క‌రోనా బారిన ప‌డ్డార‌ని ఆయ‌న వివ‌రించారు.

ఫిబ్ర‌వ‌రి నాటికి దేశంలో 50 శాతం మందికి క‌రోనా వ్యాపిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. అయితే, 50 శాతం మందికి క‌రోనా వైర‌స్ వ్యాపించ‌డం ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ వ‌స్తుంద‌ని, ఫ‌లితంగా క‌రోనా వ్యాప్తి నెమ్మ‌దిస్తుంద‌ని ప్రొఫెస‌ర్ మ‌ణీంద్ర అగ‌ర్వాల్ అంచ‌నా వేశారు. ఒక‌వేళ ప్ర‌జ‌లు అల‌స‌త్వంతో మాస్కులు ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించ‌డం వంటి నియ‌మాల‌ను వ‌దిలేస్తే త‌మ అంచ‌నాల కంటే ఎక్కువ క‌రోనా వ్యాప్తి ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు.

ప్ర‌స్తుతం టెస్టుల ఆధారంగా గుర్తించిన క‌రోనా కేసులే లెక్క‌ల్లోకి వ‌స్తున్నాయి. సాధార‌ణంగా ల‌క్ష‌ణాలు క‌లిగి ఉన్న వారే క‌రోనా టెస్టులు చేయించుకుంటున్నారు. చాలా మందికి ల‌క్ష‌ణాలు లేకుండా, తేలిక‌పాటి ల‌క్ష‌ణాలతోనే క‌రోనా వ్యాపిస్తోంది. ఇటువంటి వారు టెస్టులు చేయించుకోవ‌డం లేదు. వీరికి క‌రోనా సోకి వెళ్లిపోయిన విష‌యం కూడా తెలియ‌డం లేదు. ఇలా ఎంత‌మందికి క‌రోనా వ‌చ్చి, పోయింద‌నేది తెలుసుకోవ‌డానికి ప్ర‌భుత్వం సీరో స‌ర్వే నిర్వ‌హిస్తోంది.

కొన్ని ప్రాంతాల్లో, కొంత మందికి క‌రోనా యాంటీబాడీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి వారిలో ఎంత మందిలో క‌రోనా యాంటీబాడీస్ ఉన్నాయో గుర్తిస్తారు. క‌రోనా యాంటీబాడీస్ ఉన్నాయంటే వారికి క‌రోనా వ‌చ్చిపోయిన‌ట్లే లెక్క‌. ఈ లెక్క‌న ఎంత ఆ ప్రాంతంలో ఎంత శాతం మందికి క‌రోనా సోకింద‌నేది అంచ‌నా వేయ‌డ‌మే సీరో స‌ర్వే. ఈ స‌ర్వే ప్ర‌కార‌మే దేశంలో ఇప్ప‌టికే 14 శాతం మందికి క‌రోనా వైర‌స్ సోకింది. ఇప్పుడు ఐఐటీ కాన్పూర్ ప్రొఫెస‌ర్ చెబుతున్న దాన్ని బ‌ట్టి 30 శాతం మందికి క‌రోనా సోకి ఉండ‌వ‌చ్చ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి.

Related News