logo

  BREAKING NEWS

క‌రోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి ? మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు మొద‌ల‌వుతుంది ?  |   మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |   క‌రోనా వ్యాక్సిన్ కావాలంటే బీజేపీకే ఓటేయాలా ?  |   గుడ్ న్యూస్: వ్యాక్సిన్ రిలీజ్ డేట్ చెప్పేసిన భార‌త్ బ‌యోటెక్‌  |   మీ పిల్ల‌ల‌కు ఉచితంగా కార్పొరేట్ స్థాయి హాస్ట‌ల్‌తో కూడిన‌ విద్య కావాలా  |   RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |  

ఐదు ల‌క్ష‌ల సొర‌చేప‌లను చంపితేనే అంద‌రికీ క‌రోనా వ్యాక్సిన్‌

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం మొద‌లై 10 నెల‌లు గ‌డుస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా బారిన ప‌డుతున్న ప్ర‌జ‌ల సంఖ్య పెరిగిపోతోంది. పెద్ద సంఖ్య‌లో క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌జ‌లు మ‌ర‌ణిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క‌రోనా వైర‌స్‌కు అడ్డ‌క‌ట్ట వేయాలంటే వ్యాక్సిన్ ఒక్క‌టే ప‌రిష్కార‌మ‌ని ప్ర‌పంచ‌మంతా న‌మ్ముతోంది. క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ తీసుకురావ‌డానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు 150 ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. కొన్ని వ్యాక్సిన్‌లు క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ద‌శ‌లో ఉన్నాయి. ర‌ష్యా, చైనా మాత్రం వ్యాక్సిన్‌ను ఇప్ప‌టికే వారి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొస్తోంది.

వ‌చ్చే సంవ‌త్స‌రం మొద‌టి మూడునాలుగు నెల‌ల్లోనే వ్యాక్సిన్ అన్ని దేశాల‌కు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే, క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌కు సంబంధించి తాజాగా ఒక వార్త కొంత దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మాన‌వాళిని క‌రోనా నుంచి కాపాడాలంటే పెద్ద ఎత్తున సొర చేప‌ల‌ను చంపాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతుంద‌ని కాలిఫోర్నియా కేంద్రంగా ప‌ని చేసే షార్క్ అలైస్ అనే సంస్థ చెబుతోంది. ప్ర‌పంచంలో ప్ర‌జ‌లంద‌రికీ రెండు డోస్‌ల క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ ఇవ్వాలంటే సుమారు 5 ల‌క్ష‌ల సొర చేప‌ల‌ను చంపాల్సి ఉంటుంద‌ని ఈ సంస్థ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది.

క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌లో సొర చేప‌ల లివ‌ర్ నుంచి తీసే స్క్వాలేన్ అనే ఒక ర‌క‌మైన నూనెను వాడాల్సి ఉంటుంది. ఈ నూనె రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డానికి అద్భుతంగా ప‌ని చేస్తోంది. ఇప్ప‌టికే కొన్ని ర‌కాల రోగ నిరోధ‌క శ‌క్తి పెంపొందించే ఔష‌దాల ఉత్ప‌త్తిలో సొర చేప‌ల నుంచి తీసే స్వ్కాలేన్ నూనెను వాడుతున్నారు. ఇందు కోసం కొన్ని దేశాల్లో సొర చేప‌ల వేట కూడా చాలా రోజులుగా కొన‌సాగుతోంది. ఔష‌దాల‌తో పాటు కాస్మొటిక్స్ ఉత్ప‌త్తి కోసం కూడా సొర చేప‌ల‌కు సంబంధించిన స్వ్కాలేన్‌ను వాడుతున్నారు.

ఇందుకోసం ఇప్ప‌టికే 30 ల‌క్ష‌ల సొర చేప‌ల‌ను చంపార‌ని కొన్ని లెక్క‌లు చెబుతున్నాయి. ఇప్ప‌టికే పెద్ద ఎత్తున సొర చేప‌లు చ‌నిపోగా ఇప్పుడు క‌రోనా వైర‌స్ వ‌ల్ల పెద్ద ఎత్తున సొర చేప‌లను చంప‌నున్నారని షార్క్ అలైస్ సంస్థ వాపోతోంది. క‌రోనా వ్యాక్సిన్‌లో సొర చేప‌ల స్వ్కాలేన్‌ను వాడ‌బోతున్నార‌నే స‌మాచారంతో ఈ సంస్థ కొంత ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. సాధార‌ణంగా ఒక ట‌న్ను స్క్వాలేన్‌ను తీయాలంటే 3 వేల సొర చేప‌ల‌ను చంపి వాటి లివ‌ర్‌ల‌ను ఉప‌యోగించాలి.

ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ప్ర‌పంచంలో ప్ర‌జ‌లంద‌రికీ ఒక డోసు ఇవ్వాలంటే రెండున్న‌ర ల‌క్ష‌ల సొర చేప‌ల‌ను చంపాల్సి ఉంటుంద‌ట‌. వ్యాక్సిన్ రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంద‌ని కొంద‌రు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఒక‌వేళ గ‌నుక రెండు డోసులు ఇవ్వాలంటే 5 ల‌క్ష‌ల సొర చేప‌ల‌ను చంపాల్సి ఉంటుంది. ఇక‌, క‌రోనా వైర‌స్ ఎంత కాలం ఉంటుందో తెలియ‌దు. ఒక‌వేళ దీర్ఘ‌కాలం ఈ వైర‌స్ మ‌నుగ‌డ‌లో ఉండి, వ్యాక్సిన్ శ‌క్తి కొంత‌కాలానికే ప‌రిమిత‌మైతే వ్యాక్సిన్‌ల ఉత్ప‌త్తి మ‌రింత పెరుగుతుంది. అప్పుడు మరిన్ని సొర‌ల‌ను చంపాల్సి వ‌స్తుంది.

ఇలా జ‌రిగితే యేటేటా సొర చేప‌ల సంఖ్య త‌గ్గిపోతుంద‌ని షార్క్ అలైస్ సంస్థ ఫౌండ‌ర్ స్టెఫానీ బ్రెండిల్ అంటున్నారు. ఇలా అరుదైన జీవుల‌ను చంప‌డం మంచిది కాద‌ని ఆయ‌న చెబుతున్నారు. కాగా, సొర చేప‌ల స్క్వాలేన్‌కు బ‌దులుగా ఇమ్మునిటీ ప‌వ‌ర్ కోసం ఔష‌దాల్లో వాడేందుకు వేరే ప‌దార్థాన్ని అభివృద్ధి చేసేందుకు శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు జరుపుతున్నారు. కానీ, అవి ఒక కొలిక్కి రాలేదు. అప్ప‌టివ‌ర‌కు మాన‌వాళిని ర‌క్షించుకునేందుకు సొర చేప‌ల‌ను చంపాల్సిందేనేమో.

Related News