logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

బంగారం కొంటున్నారా? కేంద్రం కొత్త రూల్స్.. బంగారం కొనాలంటే ఇది తప్పనిసరి!

బంగారం కొనుగోలుదారులకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త వినిపించింది. బంగారం కొనుగోళ్లు, అమ్మకాలపై కేంద్రం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనుంది. మారనున్న ఈ రూల్స్ జూన్ 1 వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో బంగారం కొనుగోలు చేసేవారికి భారీ ప్రయోజనం చేకూరనుంది. ఈ నేపథ్యంలో బంగారం కొనేవారు కచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.

జూన్ 1 వ తేదీ నుంచి మోడీ ప్రభుత్వం హాల్ మార్కింగ్ విధానాన్ని తప్పనిసరి చేసింది. బంగారం అమ్మే అన్ని జ్యువెలరీ షాపులు తమ దగ్గరున్న బంగారానికి బిఐఎస్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది. అంటే వారు అమ్మే బంగారానికి బిఐఎస్ అనేది హాల్ మార్కింగ్ ను ఇస్తుంది. ఈ హాల్ మార్కు ఉన్న బంగారాన్నే వినియోగదారులు కొనాల్సి ఉంటుంది. ఇలా హాల్ మార్కు లేని బంగారం అమ్మితే వారికి భారీ జరిమానాతో పాటుగా జైలు శిక్షను కూడా విధించే అవకాశం ఉంది.

సాధారణంగా నగల తయారీకి వినియోగించే బంగారం నాణ్యతను మూడు విధాలుగా కొలుస్తారు. 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 22 క్యారెట్లుగా వీటిని విభజిస్తారు. బీఐఎస్ అనేది ఆ బంగారం నాణ్యతను పరీక్షించి హాల్ మార్కు ముద్రను వేస్తుంది. ఈ హాల్ మార్కు ద్వారానే మీరు కొన్న బంగారం నాణ్యత ఎంతో మీకు స్పష్టంగా తెలుస్తుంది. వినియోగదారులకు ప్రయోగం కలిగించేలా కేంద్రం ఈ నిర్ణయాన్ని అమలు చేయనుంది.

అందుకోసం జ్యువెలరీ షాపులు, బంగారం అమ్మే సంస్థలు ఆన్ లైన్ లో బిఐఎస్ ఇచ్చే హాల్ మార్కింగ్ కోసం రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ జ్యువెలరీ షాపులు తమ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను బిఐఎస్ గుర్తింపు కోసం ఏ అండ్ హెచ్ సెంటర్ కు పంపవలసి ఉంటుంది. అక్కడ ఆ ఆభరణాల నాణ్యతను గుర్తించి హాల్ మార్కును ఇస్తారు. ఇది బంగారం నాణ్యతకు ఒక సెర్టిఫికెట్ లాంటిది. కాబట్టి ఇకపై బంగారం కొనేవారు ఈ విషయాన్ని గుర్తించాలి.

Related News