logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

గోపీచంద్ కారణంగానే వేధింపులు ఎదుర్కొన్నాను: జ్వాలా

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా తన మాజీ కోచ్ పల్లెల గోపీచంద్ పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. భారత మహిళల బ్యాడ్మింటన్‌లో డబుల్స్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలా మంచి గుర్తింపు సంపాదించారు. ఆమెకు కోచ్ గా వ్యవహరించిన పుల్లెల గోపీచంద్ ప్రస్తుతం భారత బ్యాడ్మింటన్ టీమ్ నేషనల్ కోచ్ గా ఉన్న సంగతి తెలిసిందే.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జ్వాలా.. తన కెరీర్ లో తాను ఎదుర్కున్న వేధింపులకు గోపీచంద్ కారణమన్నారు. నేను ఏ విషయమైనా బహిరంగంగానే మాట్లాడుతా. బ్యాడ్మింటన్ లో నా సత్తా ఏమిటో ఆయనకు తెలుసు. నాకు మద్దతుగా ఉంటాడని భావించా. కానీ మిక్స్‌డ్‌లో నాతో కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో ఆడేవాడు అంటూ ఆమె వ్యాఖ్యలు చేసారు.

ఒకప్పుడు బ్యాడ్మింటన్ లో టాప్ ఆటగాళ్లంతా మన రాష్ట్రం నుంచే వచ్చేవారు. మీరు ఒకసారి గమనిస్తే గోపీచంద్ ఆడేటప్పుడు ఇతర రాష్ట్రాల నుండి ఉన్నారు. కానీ గత 10-12 ఏళ్లుగా ప్లేయర్స్ అంతా హైదరాబాద్ లోని గోపీచంద్ అకాడెమీ నుంచే వస్తున్నారు. ఆలా అయితేనే వాళ్లకు గుర్తింపు లభిస్తుంది. భారత్ కు పతకం వస్తే ఆ క్రెడిట్ అంతా గోపీచంద్ కు వెళుతుంది. ఓడిపోతే వ్యవస్థ మీదకు నెడుతున్నారని ఆమె ఆరోపించారు.

అంతర్గత రాజకీయాల కారణంగా విదేశీ కోచ్ లు పదవీ కాలం ముగియకుండానే వెళ్ళిపోతున్నారన్నారు. విదేశీ కోచ్ లు ఎందుకు ఉండటం లేదని ఆమె ప్రశ్నించారు. 2004 లో గోపీచంద్, గుత్తా జ్వాలా కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జాతీయ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ గెలుచుకున్నారు. తర్వాత వీరిద్దరి మధ్య దూరం పెరిగింది.

Related News