logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

ఆ హీరోతో రెండో పెళ్లి.. గుడ్ న్యూస్ చెప్పిన గుత్తా జ్వాలా!

భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. 2005 లో తోటి బ్యాడ్మింటన్ స్టార్ అయిన చేతన్ ఆనంద్ ను పెళ్లి చేసుకున్న జ్వాలా ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల 2011 లో అతనితో విడాకులు తీసుకున్నారు. ఆనాటి నుంచి ఆమె సింగిల్ గానే ఉంటున్నారు. అయితే ఇటీవల కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ తో జ్వాలా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటంతో వీరిద్దరూ రిలేషన్ ఉన్నారనే వార్తలు గుప్పుమన్నాయి.

ఆ వార్తలు నిజం చేస్తూ తన చేతికి ప్రియుడు రింగ్ తొడిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆనాటి నుంచి వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా రానా దగ్గుబాటి నటిస్తున్న అరణ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయంపై హీరో విష్ణు విశాల్ క్లారిటీ ఇచ్చాడు. తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని.. త్వరలోనే తెలుగింటి అల్లుడిని కాబోతున్నానని విశాల్ ప్రకటించాడు.

ఇక అరణ్య సినిమాలో విశాల్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో జ్వాలా విశాల్ తో పెళ్లిపై స్పందిస్తూ.. మా ఇద్దరి మనస్తత్వం ఒక్కటే. నా ముక్కుసూటి తనం కారణముగా నన్ను కొంత మంది ఇష్టపడకపోవచ్చు. కానీ విష్ణు నేను అత్యంత నమ్మకస్తులుగా భావించేవారిలో ఒకడు. అంటూ చెప్పుకొచ్చింది. ఇక విష్ణు విశాల్ కు కూడా ఇది రెండో వివాహమే. 2010 లో రజనీ నటరాజన్ ను పెళ్లాడిన ఈ హీరో ఆ తర్వాత 2018 లో విడాకులు తీసుకున్నాడు. ఇక వీరిద్దరి కెరీర్ విషయానికొస్తే జ్వాలా బ్యాడ్మింటన్ అకాడమీ స్థాపించి బిజీగా ఉంటె.. విష్ణు వరుస సినిమాలలో నటిస్తున్నాడు.

Related News