logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

ప్రియుడితో రిసార్ట్ కు వెళ్లిన యువతికి షాక్.. వీడియో తీసి దారుణం..

ప్రియుడితో కలిసి రిసార్టులో రొమాన్స్ చేసిన యువతిని గమనించిన ముగ్గురు యువకులు వారిద్దరినీ రహస్యంగా వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను ఇంటర్నెట్ లో పెడతామని బెదిరించి పలుమార్లు బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వారి వేధింపులు తాళలేక యువతీ ఆత్మహత్యాయత్నం చేయడంతో నిందితుల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి.

గురుగ్రామ్ కు చెందిన ఓ యువతి స్థానికంగా ఉండే ఆసుపత్రిలో పని చేస్తుంది. కొంత కాలంగా ఓ యువకుడితో ప్రేమలో ఉంది. మూడు నెలల క్రితం బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఓ రిసార్టుకు వెళ్ళింది. అక్కడే ఓ గదిలో వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న విషయాన్ని గుర్తించిన ముగ్గురు యువకుడు కిటికీలోంచి ఆ తతంగాన్నంతా వీడియో తీశారు. ఆ తర్వాత బాధితురాలికి ఓ నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. అందులో తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న వీడియో చూసి షాక్ కు గురైంది.

ఈ వీడియో చూపించి బెదిరించిన యువకులు అనేక సార్లు బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తన కుటుంబంలో తెలిస్తే పరువు పోతుందని భావించిన బాధితురాలు వారి వేధింపులు మౌనంగా భరించింది. ఇటీవల తీవ్ర మనస్థాపానికి గురైన బాధితురాలు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. ప్రస్తుతం బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.

Related News