logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

గుంటూరు విద్యార్థిని నగ్న వీడియోల కేసులో వారి హస్తం కూడా..

గుంటూరు ఇంజనీరింగ్ విద్యార్థిని నగ్న వీడియోల కేసులో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వరుణ, కౌశిక్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు యువతులను కూడా విచారిస్తున్నారు. కాగా ఈ కేసులో మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం.. మూడో నిందితుడిగా ఉన్న యువకుడు ‘మై నేమ్ ఈజ్ 420’ అనే ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో యువతి నగ్న వీడియోలను షేర్ చేసినట్టు సమాచారం. ఈ వీడియోలు అతనికి యువతీ చదివిన కాలేజీ నుంచే అందాయని తెలుస్తుంది. కానీ ఆ వీడియోలను అతనికి ఎవరు చేరవేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

వీడియోలు చూపించి బెదిరించి బాధిత యువతి వద్ద రూ. 50 వేలు డిమాండ్ చేసాడు. ఇలా చాలా సార్లు యువతి దగ్గరనుండి డబ్బులు తీసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తర్వాత యువతి నగ్న వీడియోలను మరో నలుగురు స్నేహితులతో పంచుకున్నాడు. ఇప్పటికె డెల్టా ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ కేసులో వారిని విచారిస్తే మరిన్ని నిజాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related News