logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?

ప్రపంచంలోని అతి పెద్ద వజ్రాల్లో ఒకటైన కోహినూర్ పై శతాబ్దాలుగా ఎన్నో వివాదాలు నెలకొన్నాయి. ఈ వజ్రానికి ఎంతో పెద్ద చరిత్ర ఉంది. కొన్నేళ్లుగా ఎంతో మంది రాజుల చేతులు మారిన ఈ వజ్రం చివరకు బ్రిటన్ రాణి దగ్గరకు వచ్చి చేరింది. అయితే ఎన్ని వివాదాలు ఎదురైనా బ్రిటన్ రాణి ఈ వజ్రాన్ని వదులుకోవడానికి సిద్ధపడలేదు. ఆ మాటకొస్తే గతంలో ఈ వజ్రాన్ని పొందిన రాజులెవరు దీనిని వదులుకోవడానికి ఇష్టపడలేదు. కానీ కొన్ని అసాధారణ పరిస్థితుల్లో ఈ వజ్రం చేతులు మారింది. అయితే మన దేశ రాజుల కారణంగానే ఈ వజ్రం పరాయి దేశాలకు వెళ్ళింది. ఇప్పటికే ఎన్నో సార్లు ఈ వజ్రాన్ని తమకు అప్పగించాలని భారత్ బ్రిటన్ ను కోరినా బ్రిటన్ భారత్ ప్రతిపాదనను పట్టించుకున్న దాఖలాలు లేవు. అసలు ఈ వజ్రం ఎక్కడ పుట్టింది? బ్రిటన్ కు ఎందుకు వెళ్ళింది? దీని వెనక ఉన్న చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

1,300 సంవత్సరానికి పూర్వం కోహినూర్ వజ్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కొల్లూరు గనుల్లో దొరికింది. ఈ విషయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు. అక్కకి నుంచి గోల్కొండ కోటకు చేరింది. ఆ తర్వాత అనేకమంది చేతులు మారింది. కోహినూర్ అంటే పర్షియన్ భాషలో ‘కాంతి శిఖరం’ అని అర్థం. 1948 లో సిక్కుల యుద్ధం సమయంలో రాజా రంజిత్ సింగ్ ఈ వజ్రాన్ని బ్రిటన్ కు కానుకగా ఇచ్చారు. ఆ వజ్రాన్ని ఓ ఆఫ్ఘన్ రాజు నుంచి రంజిత్ సింగ్ సొంతం చేసుకున్నాడు. అంతకు ముందు ఈ వజ్రం పర్షియన్ రాజుల సంపదగా ఉండేది. ప్రస్తుతం ఈ వజ్రం బ్రిటన్ లో ఉంది. ఈ వజ్రాన్ని ధరించిన మగవారు సర్వనాశనమైతే ఆడవారికి మాత్రం ఇది చాలా మంచి చేస్తుందని నమ్ముతారు. అందుకే బ్రిటన్ రాణి ఈ వజ్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి సిద్ధంగా లేదని చెప్తారు.

1,300 సంవత్సరానికి ముందు ఈ వజ్రాన్ని దక్కించుకున్న తొలి వ్యక్తి మాల్వా రాజు మహాలక్ దేవ్. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ సామ్రాజ్యంపై దాడిచేసి మాల్వా రాజ్యంలోని అపారమైన సంపదతో పాటుగా కోహినూర్ ను కూడా స్వాధీనం చేసుకున్నాడు. మరికొంత మంది చరిత్రకారుల కథనం ప్రకారం.. ఈ వజ్రం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి దగ్గర ఉండేదని క్రీస్తు శకం 1310 లో ఢిల్లీ సుల్తాను తో సంధి చేసుకోవడం వలన ఆ సమయంలో అపారమైన సంపదతో పాటుగా కొహినూర్ ను కూడా సమర్పించుకున్నాడని అంటారు. ఢిల్లీ రాజుల దగ్గర ఉన్న ఈ వజ్రం పాని పట్టు యుద్ధం తర్వాత బాబర్ చేతికి వచ్చినట్టుగా చెప్తారు. 1,530న బాబర్ రాసిన బాబర్ నామాలో దీని ప్రస్తావన ఉంది. ఈ వజ్రం విలువను లెక్క కట్టడం ఇప్పటికీ ఎవ్వరితరం కాలేదు.

ఈ వజ్రం విలువ ప్రపంచమంతా కలిసి ఒక రోజు చేసే ఖర్చులో సగం ఉంటుందని బాబర్ తెలిపాడు. ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోధి నుంచి బాబర్ దీనిని స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత బాబర్ నుంచి షాజహాన్, ఔరంగజేబు, సుల్తాన్ మహమ్మద్ దగ్గరకు చేరింది. సుల్తాన్ మహమ్మద్ ఈ వజ్రాన్ని ఎప్పుడూ తన తలపాగాలో దాచుకునేవాడట. ఈ విలువైన వజ్రం ఆ రాజు దగ్గర ఉందన్న విషయం తెలుసుకున్న నాదిర్ షా ఆయనను విందుకు పిలిచి తలపాగాలు మార్చుకుందామన్న ప్రతిపాదన పెట్టాడట. తప్పనిసరి పరిస్థితుల్లో తలపాగాతో పాటుగా అందులో ఉన్న ఈ వజ్రాన్ని సుల్తాన్ మహమ్మద్ వదులుకోవలసి వచ్చిందని చరిత్ర చెప్తుంది. ఆ వజ్రాన్ని చుసిన నాదిర్ షా కోహినూర్ అన్నాడట.

ఇది 1739 లో జరిగింది. ఆ తర్వాత కోహినూర్ ఎన్నో చేతులు మారుతూ పంజాబ్ పాలకుల దగ్గరకు చేరింది. 1849 లో సిక్కు యుద్ధంలో ఓటమి పాలైన రాజా రంజిత్ సింగ్ ఈ వజ్రాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి సమర్పించుకున్నాడట. ఆ విధంగా ఈ వజ్రం బ్రిటన్ కు చేరింది. బ్రిటన్ రాణి ఈ వజ్రానికి సాన పట్టించి తన కిరీటంలో పొదిగించుకుంది. అయితే బ్రిటన్ భారత్ నుంచి కోహినూర్ ను అపహరించుకు వెళ్లిందని ఎన్నో ఏళ్లుగా అపవాదును మోస్తూ వచ్చింది. సుదీర్ఘ కాలం తర్వాత 2016లో భారత్ ఈ అంశం పై స్పందిస్తూ.. బ్రిటన్ కోహినూర్ ను అపహరించుకుని వెళ్లలేదని అది కానుక మాత్రమే అని ప్రకటించడంతో ఈ వివాదం ముగిసింది. కానీ కోహినూర్ ను భారత్ కు రప్పించే ప్రయత్నాలు మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

Related News