logo

  BREAKING NEWS

రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |   కేంద్రంపై రైతుల దండయాత్ర ఎందుకు? నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది?  |  

బిడ్డతో సహా ఐదవ అంతస్తు నుంచి దూకిన మహిళా టెక్కీ.. మనోజ్ఞ కేసులో కొత్త కోణం!

తొమ్మిది నెలల కూతురిని కింద పడేసి ఇదంతుస్థుల భవనం పై నుంచి దూకి టెక్కీ మనోజ్ఞ ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. మనోజ్ఞకు కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు పోస్టుమార్టం నిర్వహించారు వైద్యులు. అయితే ఈ కేసులో ఊహించని విషయాలు బయటకు వస్తున్నాయి. మనోజ్ఞ భర్త భార్య ఆత్మహత్య పై స్పందిస్తూ పొంతన లేని సమాధానాలు చెప్తుండటం అనుమానాలకు తావిస్తోంది.

తన భార్య శనివారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో అపార్టుమెంటు పైకి వాకింగ్ కోసం వెళ్లిందని ఆ తర్వాత పెద్ద శబ్దం రావడంతో బయటకు వెళ్లి చూస్తే అపార్టుమెంట్ కింద ఇద్దరు పడి ఉన్నారని తెలిపాడు. కిందకు వెళ్లి చూసేసరికి కూతురు చనిపోయి ఉందని పాపను ఇంట్లో వదిలేసి కొన ప్రాణాలతో ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువెళ్ళమని భర్త కళ్యాణ్ చంద్ర మీడియాకు తెలిపాడు. అతను చెప్పే మాటలకూ అత్తమామలు చెప్తున్నదానికి భిన్నంగా ఉండటంతో ఈ కేసులో విచారణ వేగవంతం చేసారు పోలీసులు.

ఐదవ అంతస్తు పై నుంచి దూకినా మనోజ్ఞ శరీరం నుంచి చిన్న రక్తపు బొట్టు కూడా బయటకు రాకపోవడం, ఎముకలు విరిగిన ఆనవాళ్లు కూడా లేవని చెప్తున్నారు.మనోజ్ఞ తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిని పెళ్ళైన నాటి నుంచి అత్తమామలు వేధించారని ఇపుడు తమ బిడ్డను వారే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మనోజ్ఞ అత్తమామలపై కేసులు నమోదు చేసారు.

ప్రకాశం జిల్లా అన్నబోటం వారి పల్లె గ్రామానికి చెందిన కళ్యాణ్ చంద్రకు, పంగులూరుకు చెందిన మనోజ్ఞకు మూడేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి తొమిది నెలల కూతురు తులసి ఉంది. కళ్యాణ్ చంద్ర మెరైన్ ఇంజినీర్ కావడంతో ఐదారు నెలలకు ఓసారి ఇంటికి వచ్చేవాడు. పెళ్ళైన తర్వాత హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో ఉండే వీరిద్దరూ పాప పుట్టాక జనవరి నెలలో గుంటూరు లోని అత్తవారి ఇంటికి వెళ్లారు. లాక్ డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయారు. మనోజ్ఞ అత్తమామలు, భర్తతో కలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం అకస్మాతుగా ఆమె ఆత్మహత్యకు యత్నించడం మిస్టరీగా మారింది.

Related News