logo

గుంటూరు విద్యార్థిని రేప్ కేసు నీరుగార్చే ప్రయత్నం..?

గుంటూరు ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల పైశాచికత్వం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో ఇద్దరు నిందితులు యువతి జీవితంతో ఆడుకున్నారు. నమ్మించి మత్తు మందు ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక ఆ వీడియోలను చిత్రీకరించి అశ్లీల సైట్లలో పెట్టి మూడేళ్ళుగా యువతిని మానసికంగా వేధిస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రుల ద్వారా సమాచారం అందుకున్న దిశా పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేసారు. తాజాగా ఈ ఘటనలో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. బాధితురాలి కుటంబంతో రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అందుకే నిందితుల ఫోటోలను కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది.

ఈ ఘోరానికి పాల్పడిన ఘటనలో ఏ1 గా వరుణ తేజ్, ఏ2 గా కౌశిక్ ఉన్నారు. వరుణ్ తల్లి పోలీసు శాఖలో ఉన్నతాధికారి కాగా కౌశిక్ తండ్రి వైద్యుడిగా తెలుస్తుంది. నిందితులిద్దరూ యువతి నగ్న వీడియోలను అశ్లీల సైట్లలో ఉంచగా యువతి పోలీసులకు ఫిర్యాదు చేసే సమయానికే వాటిని తొలగించినట్టు తెలుస్తుంది. పోలీసు శాఖలో కమ్యూనికేషన్ విభాగంలో పనిచేస్తున్న నిందితుడి తల్లి కొడుకుని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి.

పోలీసు శాఖలో కమ్యూనికేషన్ విభాగంలో పనిచేస్తున్న నిందితుడి తల్లి సాంకేతికతను ఉపయోగించి ఆధారాలు దొరకకుండా చేస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పోలీసులు ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, గూగుల్ లకు లేఖలు రాశారు. కాగా మూడేళ్ళుగా విద్యార్థిని మానసికంగా వేధించిన నిందితులను వారితో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే లేదని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.

ఈ ఘటనను ను సీరియస్ గా తీసుకున్న ఏపీ మహిళా కమిషన్ చైర్మెన్ వాసి రెడ్డి పద్మ బాధితురాలి వీడియోలను ఎలాంటి సోషల్ మీడియా మాధ్యమంలో కనిపించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కేసులో మరో నిందితుడు కూడా ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతను కూడా బాధితురాలిని వీడియోలు చూపు బెదిరింపులకు పాల్పడ్డట్టు సమాచారం. అతని ఐపీ అడ్రస్ ద్వారా నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధిత యువతి అందించిన సమాచారం మేరకు ఈ కేసుతో ప్రమేయం ఉన్న ఇద్దరు యువతులను కూడా పోలీసులు అరెస్టు చేయనున్నారు.

Related News