logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

విద్యార్థినిపై అత్యాచారం కేసులో విస్తుపోయే నిజాలు.. ఇద్దరు యువతుల పాత్ర కూడా

గుంటూరు జిల్లా ఇంజినీరింగ్ విద్యార్థిని అత్యాచారం కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బాధితురాలు మైనర్ గా ఉన్న సమయం నుంచే నిందితులిద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నట్టు తేలింది. కాగా మూడేళ్ళుగా బాధితురాలిని ఆమె పై చిత్రీకరించిన నగ్న వీడియోలను చూపుతూ కౌశిక్, వరుణ్ అనే ఇంజినీరింగ్ విద్యార్థులు అత్యచారానికి పాల్పడుతున్నారు.

అయితే ఈ కేసులో మరో ఇద్దరు యువతుల పాత్ర కూడా ఉన్న విషయం షాక్ కు గురి చేస్తుంది. ఆ యువతుల్లో ఒకరు కౌశిక్ స్నేహితురాలు కాగా ఆమె వరుణ్ దగ్గర నుంచి బాధితురాలి వీడియోలు సేకరించి మరో యువతికి పంపింది. ఆమె తన సోదరుడైన కౌశిక్ కు ఈ వీడియోలను ఇచ్చింది. అందరూ కలిసి బాధితురాలి నగ్న వీడియోలను అశ్లీల సైట్లు, వివిధ సోషల్ మీడియా మాధ్యమాలలో ఉంచారు.

ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు వరుణ్, కౌశిక్ వద్దకు వెళ్లి ఆ వీడియోలను తీసేయాలని వేడుకున్నారు. అప్పుడు తొలగించిన నిందితులు మరోసారి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బాధితురాలిని బెదిరించినట్టుగా పోలీసుల విచారణలో తెలుస్తుంది. బాధితురాలు ఇంటర్ మీడియట్ చదువుతున్న సమయంలో వరుణ్ అనే స్నేహితుడితో ప్రేమలో పడింది.

వరుణ్, కౌశిక్ లు కలిసి బాధితురాలికి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి మెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆనాటి నుండి మూడేళ్ళుగా బాధితురాలిని బెదిరిస్తూ అత్యాచారం చేసారు. ఈ విషయం తెలిసిన మరో యువకుడు కూడా బాధితురాలిని బెదిరించినట్టుగా సమాచారం. అయితే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసే సమయానికే ఇద్దరు నిందితులు ఆ వీడియోలను సోషల్ మీడియా నంచి తొలగించారు. వాటిని తమకు అందించవలసిందిగా పోలీసులు ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ లకు లేఖ రాశారు. ఆ డిజిటల్ ఫుటేజ్ వస్తేనే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.

Related News