logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

బ్రేకింగ్: వికటించిన కరోనా టీకా.. ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్!

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుంది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ముందుగా ఆరోగ్య, పారిశుద్ధ్య కార్మికులకు వాక్సిన్ ను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వాక్సిన్ వికటించి గుంటూరులో ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్ అయిన ఘటనకలకలం రేపుతోంది. వాక్సిన్ తీసుకున్న తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురైన విజయ లక్ష్మి శనివారం బ్రెయిన్ డెడ్ అయినట్లుగా సమాచారం అందుతుంది.

తాడేపల్లి పీహెచ్సీ పరిధిలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్న గొట్టిముక్కల లక్ష్మి(38), ఆశా కార్యకర్త బొక్కా విజయ లక్ష్మి(42) లు ఈ నెల 20 వ తేదీన వాక్సిన్ తీసుకున్నారు. ఆ తర్వాత లక్ష్మికి తలనొప్పి ఫిట్స్ లక్షణాలు కనిపించాయి, విజయ లక్ష్మి మగత, వాంతులతో స్పృహ కోల్పోయింది. వీరిద్దరిని 22 వ తేదీన గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. వీరిద్దరికి చికిత్స చేసిన వైద్యులు విజయ లక్ష్మి కి శనివారం బ్రెయిన్ డెడ్ అయినట్టుగా ప్రకటించారు. లక్ష్మి పరిస్థితి మెరుగైందని ఆమెను త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.

విజయ లక్ష్మితో పాటుగా అదే వాక్సిన్ వయల్ వేసుకున్న మరో వైద్యుడు మాత్రం ఆరోగ్యంగానే ఉన్నాడని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జీజీహెచ్ వైద్యులు బాధితురాలికి ఏ టీకా వేశారు అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. విజయలక్ష్మి వాక్సిన్ వికటించడంతోనే బ్రెయిన్ డెడ్ అయ్యిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్నీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

Related News