logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

బ్రేకింగ్: వేదికపైనే కుప్పకూలిన ముఖ్యమంత్రి.. కరోనా పాజిటివ్!

కొంతకాలంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి కరోనా బారిన పడటం ఆందోళనకరంగా మారింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని(64)కి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆదివారం వడోదరాలోని నిజాంపూర ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సభలో ప్రసంగిస్తుండగా వేదికపైనే ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్దారించారు. ప్రస్తుతం అహ్మదాబాద్ ఆసుపత్రిలో వైస్యుల పర్యవేక్షణలో సీఎం ఉన్నారు.

ఊహించని ఈ ఘటనతో సభలోని వారంతా షాక్ కు గురయ్యారు. అయితే మొదట లో బీపీ కారణంగానే సీఎం అస్వస్థతకు గురయ్యారని బీజేపీ నేతలు భావించారు. కాగా పరీక్షల్లో కరోనాగా తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టుగా సమాచారం. కాగా ఇప్పటికే ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ కూడా కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.

Related News