logo

  BREAKING NEWS

ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |   అప్ప‌టినుంచే రామ్‌తో ప‌రిచ‌యం.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన సునీత  |   ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం జరుగుతోంది?  |   బ్రేకింగ్: హైదరాబాద్ కు కరోనా వాక్సిన్!  |   బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ!  |  

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

తెలంగాణలో నూతన సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. సోమవారం హై కోర్టు కూల్చివేతపై దాఖలైన పది పిటిషన్లను తెలంగాణ హై కోర్టు విచారించింది. చివరకు ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం పాత సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో కొత్త సచివాలయం అవసరం లేదని దీని ద్వారా వందల కోట్ల ప్రజా దానం దుర్వినియోగం అవుతుందని ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

నేడు జరిగిన విచారణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం దీనిపై కోర్టుకు వివరణ ఇస్తూ.. ఇప్పటికే సచివాలయ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, ప్రసుతం ఉన్న భవనంలో ఎలాంటి సదుపాయాలు లేవని తెలిపింది. ప్రభుత్వం తీసుకొచ్చే పాలసీ విధానాల్లో న్యాయస్థానాల జోక్యం తగదని ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం క్యాబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని వ్యాఖ్యానించింది. కోర్టులో దాఖలైన పది పిటిషన్లాలు కొట్టివేస్తున్నట్టుగా తీర్పునిచ్చింది.

మొదటి నుంచి సచివాలయ కూల్చివేత నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. ప్రస్తుతం ఉన్న భవనాన్ని కూల్చాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ఈ పురాతన భవనాన్ని కూల్చి వేయడం అంటే వందల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమే అంటూ మండిపడ్డాయి. వాస్తు నమ్మకాల పేరుతోనే సచివాలయాన్ని కూలుస్తున్నారని ఆరోపణలు చేసారు.

ఈ విమర్శలను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. తాజగా కోర్టు తీర్పుతో ప్రభుత్వానికి ఊరట లభించింది. అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వేగంగా ఉన్న కారణంగా అనుకూలంగా తీరు వచ్చినా ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కొత్త సచివాలయ నిర్మాణంపై దృష్టి సారించే అవకాశం లేదని తెలుస్తుంది.

Related News