జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేర చరిత్ర గల అభ్యర్థులకు టికెట్ ఇవ్వద్దని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరిన విషయం తెలిసిందే. ఈమేరకు ఎన్నికల ముందు 49 మంది అభ్యర్థుల నేరచరిత్రను బయటపెట్టింది. తాజాగా గ్రేటర్ ఎన్నికలు ముగియడంతో కార్పొరేటర్లుగా విజయం సాధించిన వారిలో నేర చరిత్ర ఉన్న వారి జాబితాను విడుదల చేసింది.
తాజాగా ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించిన జాబితా లో 49 మంది అభ్యర్థుల్లో ఈ గ్రేటర్ ఎన్నికల్లో 25 మంది అభ్యర్థులు విజయం సాధించారని చెప్తుంది. వీరిలో భారతీయ జనతా పార్టీకి చెందిన వారు 10 మంది ఉండగా.. టీఆర్ఎస్ పార్టీ నుంచి 8 మంది, ఎంఐఎం పార్టీ నుంచి 7 మంది నేర చరిత్ర కలిగిన వారు ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో 30 మంది నేర చరిత్ర ఉన్నవారి కార్పొరేటర్లుగా గెలిచి ఆయా పదవులను చేపట్టగా ఈ సారి వీరి సంఖ్య 25గా ఉందని ఈ సంస్థ పేర్కొంది.