పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఊహించని విధంగా బీజేపీ ఆధిక్యం సాధించింది. మొత్తం 150 డివిజన్లలో 46 డివిజన్లలో బీజేపీ లీడింగ్ లో ఉంది. 40 శాతం ఓట్లు చెల్లుబాటు కాలేదు. దీంతో సాధారణ ఓట్ల లెక్కింపులో ఎవరు ముందంజలో ఉంటారనే అంశం ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో మొదటి దశ లెక్కింపులో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది.
పటాన్ చెరువు, ఆర్సీపురం, ఛందానగర్, హైదర్ నగర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, ఓల్డ్ బోయిన్ పల్లి, హఫీజ్ పేట్, బాలా నగర్, సరూర్ నగర్, బీఎన్ రెడ్డి నగర్, కాప్రా, ఓల్డ్ మలక్పేట్, చర్లపల్లి, మీర్ పేట్ హెచ్బి కాలనీ , శేరిలింగంపల్లి, గాజులరామారం, రంగారెడ్డి నగర్ స్థానాల్లో టీఆర్ఎస్ పై చేయి సాధించింది. మరికొద్ది సేపటిలో తొలి రౌండ్ పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ తర్వాత బీజేపీ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.