ఏపీలో ఆందోళనలు చేపట్టిన వాలంటీర్లకు సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా వాలంటీర్లు సీఎం జగన్ లేఖపై స్పందించారు. విజయవాడ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర జరిగిన ఆందోళల్లో తమ ప్రమేయం లేదని వారు స్పష్టం చేసారు. కొంతమంది వ్యక్తుల ప్రలోభాలకు లొంగిన వారు ఇలా చేశారన్నారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నారు.
వాలంటీర్లందరి తరపున ముఖ్యమంత్రికి క్షమాపణలు తెలుపుతున్నామని మీడియా ముఖంగా వెల్లడించారు. కాగా వారానికి రెండు మూడు రోజులుమాత్రమే ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటూ పని చేసే విధంగా వెసులుబాటు కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తాము ముఖ్యమంత్రి బాటలోనేతాము కూడా ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. వాలంటీర్ల అంశంపై ముఖ్యమంత్రి జగన్ లేఖ ద్వారా స్పందించడంపై సంతృప్తి వ్యక్తం చేసారు.