logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

‘పంచాయతీ’ నోటిఫికేషన్ ఎఫెక్ట్: షాకిస్తున్న అధికారులు!

కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. శనివారం ఉదయం విజయవాడ ఎస్ఈసీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసారు. ప్రకాశం, విజయనగరం మినహా మిగిలిన 11 జిల్లాలో తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా నిమ్మగడ్డ వెల్లడించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో ఉద్యోగ సంఘాలు సైతం పాల్గొనలేమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. రాష్ట్రంలో కరోనా వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి మరో రెండు నెలల సమయం పట్టవచ్చని అప్పటివరకు తాము ఎన్నికల విధుల్లో పాల్గొనలేమంటూ వినతి పత్రాన్ని అందజేశాయి.

ఇప్పటికే ఎన్నికల సంఘం కోరిన ఓటర్ల జాబితా గాని, నిధుల విడుదల వంటి సమాచారాన్ని అందించడానికి ఉద్యోగ సంఘాలు నిరాకరించాయి. దీంతో ఎన్నికల సంఘం 2019 ఓటర్ల జాబితాతోనే ఈసారి ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా తెలిపింది. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో మిగిలిన బాధ్యత అంతా కూడా జిల్లా కలెక్టరు చేతికే వెళుతుంది. అందుకోసం ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులు ఈ సమావేశంలో పాల్గొనాలని నిమ్మగడ్డ ఆదేశించారు.

ఈ నేపథ్యంలో కర్నూలు కలెక్టర్ వీరపాండ్యన్ సెలవుపై వెళ్లడం గమనార్హం. ఆయన అనారోగ్యం కారణంగా రెండు రోజుల పాటు సెలవులో ఉండనున్నారని కలెక్టరేట్ సిబ్బంది వెల్లడించారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో ఎన్నికలపై గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు జిల్లాలో ఎన్నికలకు సంబందించిన ఏర్పాట్లు జరగలేదు. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తాను ఎన్నికల విధుల నుంచి తొలగించాలంటూ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేయగా ఇప్పటివరకు ఆ ఆదేశాలు అమలుకాలేదు.

ఈ సమావేశంలో పాల్గొనేలా వద్ద అనే అంశంపై ఉద్యోగ సంఘాలు చర్చించుకుంటున్నాయి. కాగా జనవరి 25 న నామినేషన్ల ప్రక్రియ ఉండగా ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ ప్రక్రియ జరగనుందని ప్రకటించారు. హై కోర్టు ఆదేశాల మేరకే రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ఉంటుందని ఆయన స్పష్టం చేసారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు ఎన్నికలపై తీర్పునిస్తే ఆ తీర్పును కూడా తప్పకుండా పాటిస్తామన్నారు.

Related News